AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinders: గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. కేవైసీ పూర్తి చేయలేదా..? నేటి నుంచి ఇవన్నీ బంద్..

గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే మీకు బిగ్ అలర్ట్. నేటి నుంచి మీరు పలు ప్రయోజనాలను కోల్పోనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీని పొందలేరు. అలాగే గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి పలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.

Gas Cylinders: గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. కేవైసీ పూర్తి చేయలేదా..? నేటి నుంచి ఇవన్నీ బంద్..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Aug 17, 2026 | 10:24 AM

Share

ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 16 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ఆదివారంతో ముగిసింది. ఈ క్రమంలో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనివారికి సోమవారం నుంచి ఏం జరుగుతుందనేది అవగాహన కలిగి ఉండాల్సిన అవసరముంది. గడువులోగా పూర్తి చేయనివారు అనేక ప్రయోజనాలను కోల్పోతారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు పొందలేరు. అలాగే గ్యాస్ సిలిండర్ల బుకింగ్, డెలివరీలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కొన్ని సమయాల్లో గ్యాస్ కనెక్షన్ ఇనాక్టివ్ అయ్యే అవకాశముంటుంది. ఈ క్రమంలో కేవైసీ పూర్తిచేయనివారు సోమవారం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనున్నారనేది ఇప్పుడు చూద్దాం.

రూ.300 సబ్సిడీ కట్

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ఏడాదికి నాలుగు సిలిండర్ల బుకింగ్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తోంది. గ్యాస్ డెలివరీ అయిన తర్వాత ఇవి అకౌంట్లలో జమ అవుతాయి. అయితే కేవైసీ పూర్తిచేయనివారికి సోమవారం నుంచి ఈ సొమ్ము నిలిచిపోతుంది. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ అవ్వదు. కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత నుంచి మళ్లీ మీకు పొందవచ్చు. పీఎంయువై లబ్దిదారులు ప్రతీ సిలిండర్‌పై రూ.300 కోల్పోతారు. 2026-27 ఆర్ధిక సంవత్సరాలనికి PMUY లబ్దిదారులకు 14.2 కేజీల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందించాలని కేంద్రం ఆమోదించింది.

సాధారణ ధరకే గ్యాస్ సిలిండర్

కేవైసీ పూర్తి చేయనివారు సాధారణ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర రూ.942 ఉండగా.. రూ.300 సబ్సిడీ అందితే రూ.642కే లభించేది. కేవైసీ పూర్తి చేయకపోతే రూ.300 నిలిచిపోవడం వల్ల రిటైల్ ధరకు సిలిండర్ పొందాల్సి ఉంటుంది. నిజమైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందించడంతో పాటు రాయితీ ప్రయోజనాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కేంద్రం కేవైసీ నిబంధన ప్రవేశపెట్టింది. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా కేవైసీ ప్రక్రియ సులువుగా పూర్తి చేయవచ్చు. మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా కేవైసీ అనేది పూర్తవుతుంది. కానీ చాలామంది ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీని వల్ల మీరు గ్యాస్ సరఫరాలో అవాంతరాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా దీనిని పూర్తి చేయాలి.

Follow Us
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..