AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!

గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించడం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గ్రామదేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ముత్యాలమ్మ దేవతకు ఓ భక్తుడు మొక్కు చెల్లించుకున్న తీరు స్థానిక భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందరికీ భిన్నంగా ఆ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల నడుమ ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కు సమర్పించాడు.

Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!
Kesamudram Bonalu
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 11:01 AM

Share

ముత్యాలమ్మ దేవతకు ఆనవాయితీగా చెల్లించే మొక్కులను ఓ భక్తుడు వినూత్న రీతిలో సమర్పించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది. బోనాల పండుగ నేపథ్యంలో ఓ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో లిక్కర్ బాటిల్ తగిలించి డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపులో పాల్గొన్నాడు. లిక్కర్ కోడితో మొక్కు చెల్లించుకొని అమ్మ.. సల్లంగా చూడు తల్లి అని మొక్కులు సమర్పించాడు.

వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తోడేటి వెంకన్న తన మొక్కును వినూత్నంగా చెల్లించుకున్నాడు. కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి చేరుకున్నాక ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ తల్లికి ఆ కోడిపుంజుతో మొక్కు చెల్లించుకున్నాడు.

భక్తి, సంప్రదాయానికి వినూత్నతను జోడించిన ఈ దృశ్యం అక్కడికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. కోడిపుంజుకు కమ్మలు, మెడలో మద్యం సీసాతో ఊరేగింపు సాగడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకల్లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.\

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..