AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi :చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది.. : శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

Irumudi :చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది.. : శివ నిర్వాణ
Shiva Nirvana
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2026 | 11:01 AM

Share

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక చాలా శ్రమ ఉంది. ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌ను పిలిచి వాళ్లతోనే చేయించడం జరిగింది. ఈ పాట థియేటర్‌లో ఒక తాండవంలా ఉంటుంది. ఇండియన్ సినిమాలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే ఒక ఫ్యామిలీ డ్రామాను ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా నేను చూడలేదు. ఇది నా గత సినిమాల్లాగా లైట్‌హార్టెడ్‌గా ఉంటుందని అనుకోవద్దు. చాలా సీరియస్‌గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది అని అన్నారు.

ఇది కూడా చదవండి :

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

అలాగే చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషన్ ఉంటుంది. రవితేజ గారి సినిమాల్లో చాలా త్వరగా షూటింగ్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆయన గ్యాప్ తీసుకోరు, ఎవరికీ గ్యాప్ ఇవ్వరు. సీలేరులో అన్ని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ గారు అందరూ ఈ కథను నమ్మి పనిచేశారు. రవితేజ లాంటి అద్భుతమైన పెర్ఫార్మర్‌తో ‘ఇరుముడి’ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్‌ను మరోసారి చూడాలనిపించేలా ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. ప్రియాకు ఇందులో మూడు సీన్లు ఉన్నాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు థియేటర్‌లో చూస్తారు.

ఇది కూడా చదవండి :

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు

అదేవిధంగా సాయికుమార్ గారు తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు. ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నక్షత్ర అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు వస్తాయి. రవితేజ గారికి, నక్షత్రకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాగే అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే జీవీ ప్రకాష్ కుమార్ గారి సంగీతాన్ని ఇష్టపడుతున్నాను. ఈ సినిమాకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేను. డీఓపీ విష్ణు శర్మ నా రైట్ హ్యాండ్. సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీరు ప్రత్యేకంగా రాస్తారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా సీరియస్ ఫిలిం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్‌తో పాటు గొప్ప ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకుని వస్తారు అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
చెవులకు కమ్మలు..మెడలో కోటర్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు..
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. డైరెక్ట్ లింక్
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!!
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
తాళాలు వేస్తే కోరికలు తీరుతాయట! నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయం..
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కారాదు.. 33 ఏళ్లలో ఓ వైద్యుడి సేవ
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
గ్యాస్ కేవైసీ పూర్తి చేయనివారికి షాక్.. నేటి నుంచి ఇవన్నీ బంద్..
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
'క్లియర్ చేస్తానా లేదా అనే ఎమోషన్స్ తీసేసి.. నా పని నేను చేశా'
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..
ఒకేసారి ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే సీన్ రివర్స్..