Petrol Price Down: వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడే కీలక ప్రకటన..
వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతోందా?. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించబోతోందా?. ఇంతకీ, ఎంతమేర తగ్గనున్నాయి.
పెట్రో ధరలు తగ్గనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఆలోచన కాదు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుందనే న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈనెల 7నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పెట్రో ధరలు తగ్గించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 90 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 మార్చితో పోలిస్తే 27శాతం వరకు క్రూడాయిల్ ధరలు తగ్గాయి.
అయితే, ఆమేరకు పెట్రో ధరలు తగ్గించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయ్ విపక్షాలు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం లీటర్‌కు ఐదు రూపాయలు చొప్పున తగ్గించే అవకాశం కనిపిస్తోంది. పెట్రో ధరల తగ్గింపుపై ఇవాళే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 110 రూపాయలకు అటుఇటుగా, డీజిల్ ధర వంద రూపాయలకు అటుఇటుగా ఉంది. ఒకవేళ పెట్రో ధరలను భారీగా తగ్గిస్తే వాహనదారులకు ఊరట లభించనుంది.
మరిన్ని జాతీయవార్తల కోసం