Vodafone Idea: వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మూడు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్
టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను తీసుకువస్తుంటాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది..
Updated on: Dec 05, 2022 | 3:34 PM

టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను తీసుకువస్తుంటాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. అదే రూ.2899, రూ.2999, రూ.3099. ఇవి మూడు వార్షిక ప్లాన్స్. ఇవన్నీ ప్లాన్స్ కూడా అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్స్.

రూ.3,099 ప్లాన్‌లో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుండగా.. మిగిలిన రెండు ప్లాన్లలో రాత్రిపూట అపరిమిత డేటా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది కంపెనీ.

రూ.2999 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. మొత్తంగా 850 జీబీ డేటా లభిస్తుంది. ఇక రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అపరిమిత డేటా అందిస్తోంది.

రూ.2899 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా ఉండగా, వ్యాలిడిటీ 365 అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిల్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా వాడుకోవచ్చు.

3,099 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌లో ఏడాది పాటు వ్యాలిడిటీతో రోజుకు 2జీబీల డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 1000 ఎస్‌ఎఎస్‌లు అందిస్తోంది. అంతేకాకుండా డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.




