AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 11: యాపిల్ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.21 వేలకే ఐఫోన్‌ 11 మొబైల్‌

మార్కెట్లో ఐఫోన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్‌ ఫోన్‌ ఎంత ధర ఉన్నా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. యాపిల్‌ నుంచి ఏదైనా కొత్త..

iPhone 11: యాపిల్ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.21 వేలకే ఐఫోన్‌ 11 మొబైల్‌
Iphone 11
Subhash Goud
|

Updated on: Dec 05, 2022 | 1:46 PM

Share

మార్కెట్లో ఐఫోన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్‌ ఫోన్‌ ఎంత ధర ఉన్నా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. యాపిల్‌ నుంచి ఏదైనా కొత్త మొబైల్‌ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగే. ఎప్పుడెప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఐఫోన్‌ 11 మోడల్‌ మరి తక్కువ ధరల్లో లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఐఫోన్‌ 11పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనప్పటి నుంచి ఈ ఫోన్‌కు ఇప్పటికే మార్కెట్లో ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ ఫోన్‌ కెమెరా, ఇతర ఫీచర్స్‌ అన్ని అద్భుతమే. ఇటీవల కంపెనీ ఐఫోన్‌ 14 సిరీస్‌ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త సిరీస్‌ వచ్చినా.. 11 మోడల్‌కు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. ఈ ఐఫోన్‌ 11 సిరీస్‌ ఇండియాలో 2019లో రూ.64,900 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ఫోన్‌ పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయి.

ఐఫోన్‌ 11 సిరీస్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 మ్యాక్స్‌ వంటి మూడు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.21,450కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,999 ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంటే దాదాపు రూ.2,049 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్​కింద మరో రూ.17,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ కేవలం రూ.21,450కే కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫీచర్స్‌:

ఈ ఫోన్‌ 6.1 అంగుళాల లిక్విడ్‌ రెటినా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ ఏ13 బయోనిక్‌ చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఐఫోన్‌ 11లో 12 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 3110 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫేస్‌ఐడీ, అల్ట్రా వైడ్‌బ్యాడ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి