AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Interesting Facts: రైలు పైకప్పుపై ఉండే ఈ గుండ్రని మూతల గురించి మీకు తెలుసా? వీటి అర్థం ఏంటి? ఎన్నో ఆసక్తికర విషయాలు

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ఒకటి. ప్రతి రోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుడు సైతం..

Train Interesting Facts: రైలు పైకప్పుపై ఉండే ఈ గుండ్రని మూతల గురించి మీకు తెలుసా? వీటి అర్థం ఏంటి? ఎన్నో ఆసక్తికర విషయాలు
Train Roof Ventilator
Subhash Goud
|

Updated on: Dec 04, 2022 | 4:44 PM

Share

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ఒకటి. ప్రతి రోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఛార్జీలు తక్కువ ఉండటం. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనునిత్యం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటుంది. అయితే రైళ్లలో ముద్రించిన వివిధ అక్షరాలు, సంఖ్యల గురించి చాలా మందికి పెద్దగా తెలియవు. వాటికి అర్థాలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిలో మీకు చెప్పుబోయేది రైలు పైకప్పుపై గుండ్రని ఆకారపు మూతలు ఉండటం. వీటి గురించి మీరెప్పుడైనా గమనించారా..? అవి ఎందు కోసం ఏర్పాటు చేశారనే అనుమానం వచ్చిందా..? అయితే వాటి గురించి తెలుసుకుందాం.

ఈ గుండ్రని ఆకారపు మూతలు కోచ్‌ల లోపల నుంచి కనిపించవు. బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే అవి కనిపిస్తాయి. రైళ్ల బోగీలపై వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. ఇండియన్‌ రైల్వే వివరాల ప్రకారం.. రైలు పైకప్పుపై అమర్చే ఈ గుండ్రని మూతలు డిజైన్‌ కోసం అనుకుంటే పొరపాటే. ప్రయాణికులు సౌకర్యంగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు. వీటిని రూఫ్‌ వెంటిలేర్లు అంటారు. ఇవి కోచ్‌ లోపల ఉన్న ఉష్ణోగ్రతను సరి చేస్తుంటాయి. కోచ్‌లలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవతుంది.

అలాంటి పరిస్థితిలో ప్రయాణికులు లోపల కూర్చున్నప్పుడు మరింతగా వేడి మొదలై ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. రైలు లోపల ఉన్న వేడి గాలి ఈ గుండ్రని పైకప్పుల ద్వారా పైకి వెళ్లిపోతుంది. అలా పైకి వెళ్లే గాలి ఈ రూఫ్‌ వెంటిలేటర్ల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుకే రైలు బోగీల్లో కిటికీలు ఉన్నప్పటికీ, వేడి గాలిని బయటకు పంపడంలో ఈ రూప్‌ వెంటిలేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి రాకుండా ఉండేలా వీటిని రూపొందించింది రైల్వే. ఇదండి రైలు పైకప్పుపై ఏర్పాటు చేసిన ఈ గుండ్రని రూప్‌ వెంటిలేటర్ల అర్థం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి