AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్‌కి అదిరిపోయే న్యూస్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్‌కి అదిరిపోయే న్యూస్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్..!
Whatsapp Feature
Shiva Prajapati
|

Updated on: Dec 04, 2022 | 8:28 PM

Share

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వీడియో కాల్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ను తీసుకురానుంది. అదే జరిగితే వినియోగదారుడు మరొక యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ.. వీడియో కాల్‌లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో విడుదల చేశారు. సెలెక్టెడ్ బీటా వినియోగదారులు ఈ న్యూ ఫీచర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైనా వాట్సాప్ బీటా 22.24.0.79 అప్‌డేట్ చేసుకుంటారో వారి యాప్‌లో ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ వస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. iOS 16.1, ఆ పై వెర్షన్లలో ఈ ఫీచర్ పని చేస్తుంది.

సరికొత్త అనుభూతి..

వాట్సాప్ విడియో కాల్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడన్‌ ద్వారా యూజర్లు పూర్తి భిన్నమైన అనుభూతిని పొందుతారాని కంపెనీ చెబుతోంది. వాట్సాప్ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనబుల్ చేస్తే.. వీడియో కాల్ సమయంలో మరొక యాప్‌ని సైతం యూజ్ చేయొచ్చు. ఇది పిక్చర్-ఇన్-పిక్చర్ వ్యూ లో కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది.

వాట్సాప్ షార్ట్‌కట్ బటన్..

ఇదేకాదండోయ్.. మరో సరికొత్త ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వాట్సప్. మెసేజ్‌ కనిపించకుండా చేసేందుకు షార్ట్‌ కట్ ఆప్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇది కూడా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్‌డేట్‌లో మెసేజ్ డిసప్పియర్ చేసే షార్ట్ కట్ ఫీచర్‌ను రీడిజైన్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో కొత్త, పాత చాట్‌లను డిసప్పియర్ థ్రెడ్స్‌గా గుర్తించడం ఈజీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో స్పేస్ సేవ్ అవుతుంది..

డిసప్పియర్ మెసేజెస్ కోసం వాట్సాప్ బీటా 2.22.25.10 అప్‌డేట్ చేస్తున్నారు. ఇది మరింత మంది బీటా యూజర్లకు చేరువకానుంది. అలాగే కొత్త షార్ట్‌కట్ ఫీచర్‌ను మేనేజ్‌ స్టోరేజ్ విభాగం నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా కొత్త ఫీచర్‌ మీ ఫోన్‌లో స్టోరేజీని సేవ్ చేయడంలో సహాయపడుతుంది. అయితే, వాట్సప్ అధికారికంగా పిక్చర్-ఇన్-పిక్చర్, షార్ట్‌కట్ ఆప్షన్‌ను ధృవీకరించలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!