6 seater E-bike: కేవలం పదివేలతోనే 6 సీటర్ ఎలక్ట్రిక్ బైకును తయారు చేసిన అసద్.. ప్రశంసించిన ఆనంద్ మహింద్రా..

మన చుట్టూ కనిపించే ప్రతి టెక్నాలజీ మానవ మేధస్సు నుంచి పుట్టినదే. కొత్తగా ఆలోచించడమే టెక్నాలజీలో పురోగతి సాధించడానికి సహకరిస్తుంది. అలా ఆలోచించిన అసద్ అబ్దుల్లా ఓ ఎలక్ట్రిక్..

6 seater E-bike: కేవలం పదివేలతోనే 6 సీటర్ ఎలక్ట్రిక్ బైకును తయారు చేసిన అసద్.. ప్రశంసించిన ఆనంద్ మహింద్రా..
6 Seater Elecric Bike
Follow us

|

Updated on: Dec 05, 2022 | 7:24 PM

మన చుట్టూ కనిపించే ప్రతి టెక్నాలజీ మానవ మేధస్సు నుంచి పుట్టినదే. కొత్తగా ఆలోచించడమే టెక్నాలజీలో పురోగతి సాధించడానికి సహకరిస్తుంది. అలా ఆలోచించిన అసద్ అబ్దుల్లా ఓ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను “హోమ్‌మేడ్ క్రియేటివ్” అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబర్ తెలిపిన సమాచారం ప్రకారం అసద్ అబ్దుల్లా అనే యువకుడు 6 సీటర్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను నిర్మించాడు. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో అనేక రకాలయిన నూతన తయారీలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ 6 సీటర్ ఈ-సైకిలుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు యూట్యూబర్. ఆ చానల్ కు ఇప్పటికే 395k కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

అతి తక్కువ బడ్జెట్‌తోనే..

ఇవి కూడా చదవండి

తన దగ్గరున్న 10,000 రూపాయలతోనే అసద్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను నిర్మించాడు. ఆరుగురు ప్రయాణీకుల బరువును తట్టుకోగల దీనిని ఛాసిస్ మెటల్ ట్యూబ్‌లతో తయారు చేశాడు. ఇందులో మొత్తం ఆరు హ్యాండిల్‌బార్లు, ఆరు సైకిల్ సీట్లు ఉన్నాయి. అయితే ఈ-సైకిలులోని ముందు హ్యాండిల్‌బార్ మాత్రమే కదులుతుంది, మిగిలిన ఐదు కదలవు. ఇంకా ప్రతి సీటుకు ప్రత్యేకంగా ఫుట్‌రెస్ట్ ఉంది. దీని చివరి సీటు కింద, 48V 30 Ah పెద్ద బ్యాటరీ ప్యాక్, మోటార్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 80 కిమీల మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే రూ. 15 కంటే ఎక్కువ ఖర్చవుతుందని కూడా ఆయన చెప్పారు.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..

దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ అవడంతో దాదాపు 21K మంది చూశారు. ఇంకా ఈ వీడియోను చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ట్విట్టర్‌లో వీడియోను పంచుకున్నారు. ఇంకా ఇలాంటివారిని ప్రోత్సహించాలని అన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..