Tollywood: మహేష్ వద్దన్న కథను ఇష్టపడి చేసిన ప్రభాస్.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెల్సా
ఓ స్టార్ హీరో నో చెప్పిన కథ.. మరో స్టార్ హీరో దగ్గర వెళ్ళడం సర్వసాధారణం. అయితే అలా వెళ్లిన కథలు కొన్ని హిట్స్ అందిస్తే.. మరికొన్ని అట్టర్ ప్లాప్‌లుగా మారాయి. అలా ఓ హీరో వద్దని చెప్పిన.. కథతో మరో హీరో సినిమా తీసి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత..!

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చక్రం సినిమా కథను తొలుత మహేష్ బాబు తిరస్కరించారు. క్లైమాక్స్‌లో చనిపోయే పాత్ర తనకు సరిపోదని ఆయన భావించారు. ఆ తర్వాత ఆ కథను ప్రభాస్ ఎంతో ఇష్టపడి చేశారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినా, ప్రభాస్ నటనకు ప్రశంసలు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే.! సినీ ఇండస్ట్రీలో ఒక హీరో వదులుకున్న కథ మరొక హీరోకు విజయాలను అందిస్తే, కొన్నిసార్లు పరాజయాలనూ తెచ్చిపెడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ ఆరంభంలో మురారి వంటి హిట్ చిత్రంలో నటించారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణవంశీ చక్రం కథను మహేష్ బాబుకు వినిపించారట. అయితే, క్లైమాక్స్‌లో పాత్ర చనిపోవడం వల్ల ఆ కథ తనకు సరిపోదని భావించి మహేష్ బాబు దాన్ని సున్నితంగా తిరస్కరించారు.
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ కథను ఒక చిన్న హీరోతో చేయాలని కృష్ణవంశీ ఆలోచించారు. అనూహ్యంగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ కథను విన్నారు. అది ఆయనకు బాగా నచ్చడంతో, దర్శకుడు వద్దని వారించినా ప్రభాస్ ఎంతో పట్టుబట్టి చక్రం సినిమాలో నటించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ, ప్రభాస్ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను యువ ప్రేక్షకులు ఇప్పటికీ ఫేవరెట్‌గా చూస్తారు. ప్రభాస్ ప్రాణం పెట్టి నటించి, తనలోని పూర్తి స్థాయి నటుడిని ఈ సినిమాతో బయటకు తీసుకొచ్చారని చెప్పవచ్చు. తన కెరీర్ ఆరంభంలో ప్రభాస్ ఇలాంటి డిజాస్టర్‌ను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకుని తన కెరీర్‌ను మలుపు తిప్పుకున్నారు. అలాగే బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారారు.
ఇది చదవండి: పిలవని పెళ్లి భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష ఎంత పడుతుందో తెల్సా..
