Late Night Eating: రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే దాని వల్ల కలిగే సమస్యలేమిటో తెలుసా..? ఆ వివరాలు మీ కోసమే..
రాత్రిపూట భోజనం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా అర్థరాత్రి వరకు పని చేయడంతో చాలా మంది రాత్రి భోజనం ఆలస్యంగా తింటారు. కొంతమందికి అర్థరాత్రి..
రాత్రిపూట భోజనం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా అర్థరాత్రి వరకు పని చేయడంతో చాలా మంది రాత్రి భోజనం ఆలస్యంగా తింటారు. కొంతమందికి అర్థరాత్రి దాటిన తర్వాత భోజనం చేసే అలవాటు కూడా ఉంది . కానీ ఆలస్యంగా తినడమనే ఈ అలవాటు మానవ అరోగ్యానికి చాలా హానికరం, ఇంకా అనేక దుష్ప్రభావాలను చూపుతుంది. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే వెనువెంటనే దానిని మానుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే రాత్రిపూట భోజనం ఆలస్యంగా తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. దాంతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
NCBI పరిశోధనల ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత తినడం మానవ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 గంటల వ్యత్యాసం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటారు కొందరు. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఫలితంగా శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆలస్యంగా రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు, వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు: అర్థరాత్రి ఆహారపు అలవాట్లు మన జీర్ణవ్యవస్థపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. నిజానికి రాత్రి భోజనం చేసిన తర్వాత శారీరకంగా ఎలాంటి చలనం చూపించలేం ఇంకా నేరుగా నిద్రపోతాం. దీని వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇవే కాకుండా, అనేక ఇతర కడుపు రుగ్మతలు సంభవించడం కూడా ప్రారంభమవుతాయి.
బరువు పెరగవచ్చు: అర్థరాత్రి తినడం వల్ల బరువు పెరిగే సమస్య కలగడం చాలా సాధారణం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు మందగిస్తాయి. దీని వల్ల ఆహారం నుంచి తీసుకునే కేలరీలు సరిగ్గా కరగవు. ఇంకా శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి భోజనం తర్వాత ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. కాబట్టి భోజనానికి నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండడం అవసరం.
రక్తపోటు: పరిశోధనల నివేదిక ప్రకారం, రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాక రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండదు. ఆపై ఇది గుండె సంబంధిత రక్తపోటుకు, ఇతర సమస్యలకు దారితీస్తుంది.
తగినంత నిద్ర ఉండదు: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటే నిద్రలేమి కూడా రావచ్చు. ప్రజలు తరచుగా రాత్రిపూట త్వరగా నిద్రపోలేకపోతున్నారని అనేక నివేదికలు వచ్చాయి. ఆలస్యంగా తినడమే దీనికి మూల కారణం. ఆలస్యంగా తిన్న ఆహారాన్నిమానవ శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. ఫలితంగా మీకు నిద్ర సమస్య కలిగేలా చేస్తుంది.
శక్తి స్థాయి తగ్గుతుంది: రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకుంటే మరుసటి రోజు మలబద్ధకం, తలనొప్పి, ఇతర సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ రోజంతా వృధా కావచ్చు.
మెదడుకు హానికరం: రాత్రిపూట ఆలస్యంగా తినడం మన మెదడుకు కూడా చాలా హానికరం. రాత్రి నిద్ర లేకపోవడం, అనేక ఇతర కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మరుసటి రోజు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ప్రభావితం అవుతాయి. రాత్రి భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..