Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Wedding Card: పెళ్లి ఓ స్టాక్ మార్కెట్.. ఇలాంటి వినూత్న వెడ్డింగ్ కార్డును ఎప్పుడైనా చూశారా..

నేటి తరం జంటలు తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్‌ జంట తమ వెడ్డింగ్‌ కార్డ్‌ను వినూత్నంగా రూపొందించారు. జీవితాన్ని స్టాక్ మార్కెట్ తో పోల్చారు..

Unique Wedding Card: పెళ్లి ఓ స్టాక్ మార్కెట్.. ఇలాంటి వినూత్న వెడ్డింగ్ కార్డును ఎప్పుడైనా చూశారా..
Unique Wedding Card
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2022 | 11:05 AM

ప్రపంచంలో పెళ్లి అనేది ఒక రీతి రివాజు.. అయితే అయ్యా సంప్రదాయాలను అనుసరించి పెళ్లివేడుకను జరుపుకుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పెళ్ళికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.  దీంతో ఇప్పడూ  ధనవంతులు, సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రమే కాదు.. సామాన్యుల వివాహాలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. సామాన్య ప్రజలు తమ తెలివి తేటలకు ఆలోచనలకూ పదుని పెట్టి.. డిఫరెంట్ పద్దతిలో పెళ్ళిళ్లకు రెడీ అవుతున్నారు. కొందరు తమ పెళ్లిళ్లకు డబ్బు ఖర్చు పెట్టి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తుంటే.. మరికొందరు ప్రత్యేక ప్రదేశాల్లో పెళ్లి చేసుకుని ప్రపంచం దృష్టిలో పడాలని కోరుకుంటున్నారు. అయితే మరికొందరు తమ వెడ్డింగ్ కార్డ్స్ ను డిఫరెంట్ గా ముద్రించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇది చూసిన తర్వాత నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వివిధ రకాల వెడ్డింగ్ కార్డ్‌లను చూసి ఉంటారు. అయితే ఇలాంటి వెడ్డింగ్ కార్డు చాలా అరుదు.. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ నేపథ్యం ఉన్న వెడ్డింగ్ కార్డ్ కనుక ఇలాంటివి చాలా అరుదుగా చూస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పెళ్లి కార్డు. ఈ కార్డుపై రాసిన విషయం పూర్తిగా స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. విశేషమేమిటంటే స్టాక్ మార్కెట్ లో ఉపయోగించే వర్డ్స్ తో వినూత్నంగా వెడ్డింగ్‌ కార్డ్‌ ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వెడ్డింగ్ కార్డ్ మహారాష్ట్రకు చెందిన వైద్యుడికి చెందినది.. వధువు కూడా డాక్టర్. నాందేడ్‌కు చెందిన డాక్టర్‌ సందేశ్‌, డాక్టర్ దివ్యల వివాహం, రిసెప్షన్‌ డిసెంబర్‌ 6, 7 తేదీల్లో జరుగనుంది. స్టాక్‌ మార్కెట్‌ను ఎంతో ఇష్టపడే వరుడు సందేశ్‌ తల్లిదండ్రులు వెడ్డింగ్‌ కార్డును స్టాక్ మార్కెట్ పదజాలంతో వినూత్నంగా రూపొందించారు. పెళ్లి కార్డులో సాధారణంగా దేవుని పేరు అంటే ‘శ్రీ గణేశాయ నమః’ అని రాసి ఉండటాన్ని మీరు తప్పక చూసి ఉంటారు, కానీ ఈ కార్డులో దేవుని పేరుకు బదులుగా రాకేష్ జుంఝన్‌వాలా, వారెన్ బఫెట్, హర్షద్ మెహతా పేర్లు వ్రాయబడ్డాయి. వరుడు డాక్టర్‌ సందేశ్‌ను మెడిసిన్‌ లిమిటెడ్‌గా, వధువు డాక్టర్‌ దివ్యను అనస్థీషియా లిమిటెడ్‌ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. అయితే ఈ కార్డ్ నిజమైనది లేదా ఎవరైనా సరదాగా తయారు చేశారా అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.

ఈ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో thestockmarketindia అనే IDతో షేర్ చేశారు. ఇప్పటివరకు 7 వేలకు పైగా లైక్‌లను పొందింది. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ‘నెక్స్ట్ లెవల్ స్టాక్ మార్కెట్ క్రేజ్’ అని ఒక యూజర్ రాస్తే, ‘ఇది చదివిన తర్వాత నా మనసు ఉలిక్కిపడింది’ అని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..