Viral Video: వయసులో చిన్న.. మనసులో మిన్న ఈ చిన్నారులు .. రోడ్డుమీద తెరచిన మ్యాన్ హోల్ చూసి ఏమి చేశారంటే..

ఎక్కడైనా రోడ్డుమీద మ్యాన్‌హోల్‌లు తెరిచి ఉంటే.. దానిని దాటుకుని.. లేదా వాటిని తప్పించుకుని వెళుతూ ఉంటారు. అంతేకాని తెరచిన మ్యాన్ హొల్స్ ను మూత పెట్టడం గురించి ఆలోచించరు. తద్వారా ఆ మ్యాన్‌హోల్‌ల వల్ల ఒకొక్కసారి దారుణమైన ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

Viral Video: వయసులో చిన్న.. మనసులో మిన్న ఈ చిన్నారులు .. రోడ్డుమీద తెరచిన మ్యాన్ హోల్ చూసి ఏమి చేశారంటే..
Kid Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2022 | 12:49 PM

మంచితనం, మానవత్వం, బాధ్యత అనేవి వయసుకి సంబంధం లేవు. సమాజం కోసం మనం ఏ పెద్ద పని చేయవలసిన అవసరం లేదు. చిన్న చిన్న పనులు, దయతో కూడిన హృదయం సమాజంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.. చిన్న పిల్లలు పెద్ద మనసుతో చేసే పనులు సమాజంలోని ప్రజలకు గుణపాఠం నేర్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో సమాజం ఏమైతే నాకు ఏమిటి అనే అనేక మంది ప్రజలకు గుణపాఠం నేర్పడానికి పని చేస్తుంది. అయితే పిల్లలు పెద్దలకు పాఠాలు చెప్పడం లేదు. రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ను చాలాసార్లు తెరిచి ఉంచడం.. అందువలన అనేక సమస్యలు తలెత్తడం మీరు చూసి ఉండాలి.  తెరచి ఉంచిన మ్యాన్‌హోల్స్ కారణంగా చాలా సార్లు ప్రజలు ప్రమాదాలకు గురవుతున్న దారుణ ఘటనలు గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే ఈ వైరల్ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరూ తప్పక కొన్ని విషయాలను నేర్చుకోవాల్సిందే అని అంటారు ఎవరైనా..

ఎక్కడైనా రోడ్డుమీద మ్యాన్‌హోల్‌లు తెరిచి ఉంటే.. దానిని దాటుకుని.. లేదా వాటిని తప్పించుకుని వెళుతూ ఉంటారు. అంతేకాని తెరచిన మ్యాన్ హొల్స్ ను మూత పెట్టడం గురించి ఆలోచించరు. తద్వారా ఆ మ్యాన్‌హోల్‌ల వల్ల ఒకొక్కసారి దారుణమైన ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే  వైరల్ అవుతున్న వీడియోలో పిల్లలు చేసిన పనిని చూసిన నెటిజన్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. రోడ్డు మధ్యలో ఓ మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంది.  ఎదురుగా ఇద్దరు చిన్నారులు స్కూల్ బ్యాగ్స్ వేసుకుని వస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇద్దరి చిన్నారులు మ్యాన్‌హోల్‌ లోపల చూశారు. అది చాలా లోటు ఉన్నట్లు గుర్తించినట్లు ఉన్నారు.. వెంటనే రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌కు ఇరువైపులా ఉంచారు. ఇలా చేయడం వలన ఆ రోడ్డు మీద వెళ్లే ప్రయాణీకులకు తెరచిన మ్యాన్ హోల్ వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. అదే సమయంలో.. చాలా మంది కారులో ఆ రోడ్డుమీద వెళ్తూనే ఉన్నారు. ఎవరూ కారు ఆపడం కానీ.. బాలుడి, బాలికకు సాయం చేయడం కానీ చేయలేదు. కనీసం  పిల్లలు రోడ్డుమీద ఏమి చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయలేదు.

ఇవి కూడా చదవండి

చిన్న వయసులో పెద్ద మనసు 

ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. మీరు చేసే పనిలో వైవిద్యం  చూపడానికి వయసుతో పనిలేదు అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశారు. కేవలం 33 సెకన్ల ఈ వీడియో 1 లక్షా 15 వేలకు పైగా వ్యూస్ ను, 10 వేలకి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.  అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. ‘పిల్లలు సంస్కారవంతులు’ అని కొందరు, ‘పిల్లలు భగవంతుని స్వరూపం’ అని మరికొందరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే