Bhupendra Patel: గుజరాత్‌లో సీఎంగా రెండోసారి ప్రమాణం చేయనున్న భూపేంద్ర పటేల్.. ఎప్పుడంటే..?
గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు ఏకపక్షంగా BJPకి పడటంతో గత రికార్డులన్నీ బ్రేక్ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.

Gujarat Assembly Election Result: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు ఏకపక్షంగా BJPకి పడటంతో గత రికార్డులన్నీ బ్రేక్ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ కకావికలం అయ్యింది. ఏకంగా బీజేపీ 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ దెబ్బకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రావడంతో హస్తం పార్టీ 20 స్థానాలకే పరిమితం అయ్యేట్టే కనిపిస్తోంది. గుజరాత్‌లో ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉనికిని చాటుకుంది.
ఇప్పుడిప్పుడే అభ్యర్థుల విజయాలు కూడా వెల్లడవుతున్నాయి. 14 డిక్లేర్ చేస్తే అందులో 13 బీజేపీ అభ్యర్థుల విజయాలే ఉన్నాయి. ఒక చోట కాంగ్రెస్ గెలుపు అధికారికంగా ఖాయమైంది. రికార్డు స్థాయిలో బీజేపీకి 53.50 శాతం ఓట్లు పడటంతో బీజేపీ రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ప్రధాని మోడీ వ్యూహంతో బీజేపీ గత రికార్డులన్నీ బ్రేక్ చేసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం డిసెంబర్ 11న జరిగే అవకాశం ఉందని సమాచారం. గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఈనెల 10 లేదా 11న ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.




ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకావచ్చని వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. భూపేంద్ర పటేల్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..