వార్నీ.. తల్లికి బదులు కూతురు పరీక్ష.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అధికారులు..!
దాంతో అతను ఆ విద్యార్థినిని మాస్క్ తీయాలని కోరగా, అసలు విషయం బయటపడింది. విద్యార్థిని మాస్క్ తీయగా,..ఆ స్టూడెంట్ అడ్మిట్ కార్డులోని ఫోటో, పరీక్ష ఇన్విజిలేటర్ వద్ద గల హాజరు రిజిస్టర్‌లోని ఫోటోకు భిన్నంగా ఉండటం కనిపించింది. దాంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

పదో తరగతి పరీక్షల్లో తల్లికి బదులు కూతురు పరీక్ష రాస్తూ పట్టుబడింది. ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో వెలుగుచూసింది. నాగపట్నంలోని నటరాజన్-తమయంతి పాఠశాలలో నిన్న అంటే ఏప్రిల్2న 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. ఒక గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థిని మాస్క్ ధరించి ఉండటంతో పరీక్ష ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది. దాంతో అతను ఆ విద్యార్థినిని మాస్క్ తీయాలని కోరగా, అసలు విషయం బయటపడింది. విద్యార్థిని మాస్క్ తీయగా,..ఆ స్టూడెంట్ అడ్మిట్ కార్డులోని ఫోటో, పరీక్ష ఇన్విజిలేటర్ వద్ద గల హాజరు రిజిస్టర్‌లోని ఫోటోకు భిన్నంగా ఉండటం కనిపించింది. దాంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. డూప్లికేట్ ఫోటోతో ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విచారించగా, ఆమె అదే ప్రాంతానికి చెందిన సెల్వాంబిక (23) అని, నాగై ప్రభుత్వ ఆసుపత్రిలో కిచెన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన తల్లి సుగంధి (44) లాగా నటించి పరీక్ష రాయడానికి ప్రయత్నించిందని తేలింది. 28వ తేదీన జరిగిన తమిళ సబ్జెక్టు పరీక్షను సెల్వాంబిక స్వయంగా రాసినట్లు వెల్లడైంది.
ఈ ఎగ్జామ్ తన కూతురితో రాయించే ప్రయత్నం చేసినందుకు గానూ వారిపై కేసు నమోదు చేశారు. వారిని విచారణ కోసం వెలిపాలయం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విద్యా శాఖ అధికారులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..