అక్షర పేరంటం…ఊరంతా ఆహ్వానం..! ఇదేందబ్బా కొత్తగా ఉంది..?
ముందుగా గ్రామ పెద్దలు అందరినీ కలిసారు. గ్రామంలో మంచి విద్యను అందిస్తామని, అన్ని వసతులు ఉన్నాయని తమకు సహకరించాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇంటికి గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళారు. విద్యార్దుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు అందిస్తామని గ్రామస్తులతో కలిసి భరోసా ఇచ్చారు.

పిల్లలను తమ బడిలో చేర్పించండి.. మంచిగా విద్యాబుద్ధులు నేర్పిస్తాం అంటూ వినూత్న కార్యక్రమం చేపట్టారు సర్కారు బడి మాస్టార్లు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం శృంగవృక్షం శివారు బంటుమిల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే అక్కడ చదువు మంచిగా చెబుతున్నా విద్యార్థులు చేరడంలేదు. అందరూ ప్రయివేటు స్కూల్ లో చేరుతున్నారు. తమ బడిలో పిల్లలను చేర్చుకోవడానికి ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారు ఆ స్కూల్ లో పని చేస్తున్న టీచర్లు. ముందుగా ఎంతమంది ప్రయివేటు స్కూల్ కు వెళుతున్నారు అనేది గ్రామంలో సర్వే చేసి తెలుసుకున్నారు.
మెత్తం 60 మంది విద్యార్థులు తమ గ్రామం నుండి ప్రయివేటు స్కూల్ కి వెళుతున్నట్టు, తొమ్మిది వివిధ ప్రయివేటు స్కూల్ బస్సులు గ్రామంలోనికి వస్తున్నట్టు గుర్తించారు. ఇంకా వెంటనే ఆ పిల్లలను తమ సర్కారీ బడిలో ఎలా చేర్చుకోవాలి అనే విషయంపై టీచర్లు అంతా చర్చించుకుని ‘ అక్షర పేరంటం ‘ అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు.
ముందుగా గ్రామ పెద్దలు అందరినీ కలిసారు. గ్రామంలో మంచి విద్యను అందిస్తామని, అన్ని వసతులు ఉన్నాయని తమకు సహకరించాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇంటికి గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళారు. విద్యార్దుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు అందిస్తామని గ్రామస్తులతో కలిసి భరోసా ఇచ్చారు.
విద్యార్థుల తల్లులకు బొట్టు పెట్టి తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని కోరారు. గ్రామపెద్దలు, గ్రామస్తులతో ఉపాద్యాయులు చేసిన కృషి ఫలించింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అంగీకరించారని ప్రధానోపాధ్యాయులు జీవివి రామానుజరావు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి