AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖ ప్రేమోన్మాది దాడి కేసు! యువతి ఇప్పుడెలా ఉందంటే? తాజా అప్డేట్‌

విశాఖపట్నంలో జరిగిన ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. నిందితుడు నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి గతంలోనూ ఇలాంటి దాడి జరిగిందని తెలిపారు. త్వరిత న్యాయం కోసం డిమాండ్లు వస్తున్నాయి. సీఎం కూడా ఈ కేసుపై సీరియస్‌గా ఉన్నారు.

Vizag: విశాఖ ప్రేమోన్మాది దాడి కేసు! యువతి ఇప్పుడెలా ఉందంటే? తాజా అప్డేట్‌
Vizag Case
SN Pasha
|

Updated on: Apr 03, 2025 | 12:39 PM

Share

విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుపై సీరియస్ అయినట్లు సమాచారం.

బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దీంతో.. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా త్వరగా శిక్షపడేలా చూస్తామని సీపీ అన్నారు. కాగా నవీన్ కత్తితో దాడి చేయడంతో స్పాట్‌లోనే చనిపోయిన యువతి తల్లి లక్ష్మి మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రేమ పేరుతో నవీన్‌ గతంలో తమ కూతురిపై దాడి చేశాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అప్పట్లో నవీన్ భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పెద్దల సమక్షంలో పంచాయతీతో ఆగిపోయామని అన్నారు. కానీ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన నవీన్‌కు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు యువతి తండ్రి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి