Andhra: అలా ఎలారా.? ఈ కొత్త రకం దొంగలు ఏం చేశారో తెలిస్తే కళ్లు తేలేస్తారు..
అసెంబ్లీ ఆవరణలో ఒక వైపు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ నాలుగు లక్షల రూపాయల్ని కాజేశారు. ప్రమాణ స్వీకారం నడుస్తుండగానే.. తమ చేతివాటం చూపించారు. నిన్నటి రోజున ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగుతుండగా..

అసెంబ్లీ ఆవరణలో ఒక వైపు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ నాలుగు లక్షల రూపాయల్ని కాజేశారు. ప్రమాణ స్వీకారం నడుస్తుండగానే.. తమ చేతివాటం చూపించారు. నిన్నటి రోజున ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగుతుండగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అధికార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పోలీసు భద్రతా సిబ్బంది గాలివానల్లా గుంపులుగా సంచరిస్తుంటే, జేబుదొంగలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ తెలివిగా తమ పని ముగించేశారు.
దొంగలు ఎవరి జేబులూ వదిలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులో ఉన్న రూ. 10,000 పోయింది. ఆయనకు భద్రత కల్పించే గన్‌మెన్ జేబులో ఉన్న రూ. 40,000ను దొంగలు ఎత్తుకెళ్లారు. న్యాయస్థానం ప్రతినిధిగా హాజరైన హైకోర్టు లాయర్ జేబులోని రూ. 50,000 కూడా మాయమైంది. అంతేకాకుండా, మరో బాధితుడు రూ. 32,000 పోగొట్టుకున్నాడు. సెక్యూరిటీ ఎక్కువగా ఉండే శాసనసభ ప్రాంగణంలోనే దొంగలు ఏకంగా రూ. 4 లక్షల విలువైన నగదు ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసే విషయం. దీంతో అసెంబ్లీ భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ జేబుదొంగలు పూర్తిగా ప్రొఫెషనల్ మోడ్‌లో పని చేసినట్లు తెలుస్తోంది. హడావుడి వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని, ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో జేబులను ఖాళీ చేయడం, కనీసం బాధితులకు కూడా వెంటనే తెలియకుండా మాయమవడం, వీరి ట్రైనింగ్‌ను రిఫ్లెక్ట్ చేస్తోంది. ఘటన అనంతరం, భద్రతా అధికారులు అసెంబ్లీ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దొంగల గుర్తింపుపై స్పష్టత రాలేదు. ఈ సంఘటన తర్వాత శాసనసభ భద్రతను మరింత కఠినతరం చేయాలనే డిస్కషన్ ప్రారంభమైంది. ఇకపై అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ఈ సంఘటన అందిస్తోంది. “అసెంబ్లీ పరిసరాల్లోనూ భద్రత కరువవుతుంటే, బయట పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగల ఆటను పోలీసులు పట్టించుకుంటారా? లేదా అసెంబ్లీ దొంగలు మరోసారి చాకచక్యంగా తప్పించుకుంటారా? సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన విషయం!