AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. జీవితకాలం ప్రత్యేక సదుపాయాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఇలలో కలియుగ వైకుంఠ క్షేత్రంగా భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటారు భక్తులు. రోజూ వేలాది మంది స్వామివారి దర్శనం కోసం తిరుమలకు తరలివస్తారు. అయితే తాజాగా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకుని వచ్చింది. రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. అవి ఏమిటంటే

Tirumala: శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. జీవితకాలం ప్రత్యేక సదుపాయాలు..
Tirumala
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Apr 03, 2025 | 2:15 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజుల్లో రూ.కోటి విరాళం ఇచ్చిన భక్తులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలపై ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తోంది. రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది.

ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక రవికే, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు, ఏడాదిలో ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చని స్పష్టం చేసింది. వీటితో పాటుగా రూ. 3 వేలు అద్దె విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పించనుంది.

అంతేకాకుండా జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయంలో చూపించి దాతలు పొందవచ్చని వారు టీటీడీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

టీటీడీ ట్రస్ట్ లకూ దాతలు డొనేషన్లు ఇవ్వొచ్చు.

శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే దాతలు విరాళాలను టీటీడీ ట్రస్ట్ లకు ఇవ్వవచ్చని టీటీడీపేర్కొంది. కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్ర‌స్టు, శ్రీ వేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వాణి ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చని స్పష్టం చేసింది.

దాతలు టీటీడీ వెబ్ సైట్ www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టీటీడీ పేరిట డి.డి లేదంటే చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగం (డోనార్ సెల్) లో అందజేయాలని టీటీడీ కోరుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..