Swapna Shastra: కలలో కోతి ఇలా కనిపిస్తే జాగ్రత్త సుమా.. కష్టాలు మీకు స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నాయని ఆర్ధం..
నిద్రపోతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇవి సర్వసాధారణం. అయితే కలలో జంతువులు, పక్షులు, దేవుళ్ళు, సంఘటనలు, మన పూర్వీకులు వంటి అనేక రకాల విషయాలు కనిపిస్తాయి. అవును కలలో ఆవులు, కోతులు, గుర్రాలు, బంగారం, వెండి లేదా అనేక ఇతర వస్తువులను కలలో చూస్తాము. ఇలాంటి కలల వెనుక లోతైన అర్థం దాగి ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ రోజు వానరం కలలో కనిపిస్తే ఆ కలకు స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఏమిటో తెలుసుకుందాం..

అందరూ నిద్రపోతున్నప్పుడు కలలు కంటారు. కలలలో మనం వేరే ప్రపంచాన్ని చూస్తాము. కొంతమంది నిద్ర లేవగానే ఆ కలలను మర్చిపోతారు. అయితే కొన్ని కలలను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలలో కనిపించే ప్రతిదానికీ కొంత అర్థం ఉంటుంది. కొన్ని కలలు మన భవిష్యత్తును సూచిస్తాయి. కనుక ఆ కలల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం చేసుకోవడం ద్వారా మనం భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కలలో ధాన్యపు కుప్ప మీద నిలబడటం అంటే మీరు త్వరలో సంపదకు యజమాని అవుతారని అర్థం. పిల్లి, కుక్క, ఆవు వంటి జంతువులు కలలో కనిపిస్తే ఎటువంటి అర్ధం దాగి ఉందో.. ఎవరైనా కలలో కోతిని చూసినా కూడా దాని వెనుక చాలా అర్థం దాగి ఉంటుంది. కలలో ఏ కోతి రూపం శుభప్రదమైనది.. ఏది అశుభకరమైనదిగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.
నవ్వుతున్న కోతి కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కోతి నవ్వుతూ కనిపిస్తే.. మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. ఈ కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాబోయే కాలంలో సమాజంలో మీ గౌరవం పెరగవచ్చు. ఎవరితోనైనా పాత శత్రుత్వం కూడా అంతం కావచ్చు.
ఆహారం తింటున్న కోతి కలలో కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలో నైనా కోతి ఏదైనా తింటూ కనిపిస్తే అది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. ఈ కల మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. ఎందుకంటే మీరు, మీ కుటుంబం భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
కోపంగా ఉన్న కోతి
కలలో కోపంగా ఉన్న కోతిని చూసినట్లయితే మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నారని లేదా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. ఇలాంటి కల చెడ్డ శకునం అని స్వప్న శాస్త్రం పేర్కొంది. భార్య భర్తల మధ్య గొడవకు దారితీయవచ్చు. దీనితో పాటు సమాజంలో కీర్తిని కూడా కోల్పోవచ్చు.
కలలో కోతుల గుంపును చూడటం
కలలో కోతుల గుంపును చూడటం మంచి కల అని.. ఇది శుభ సంకేతం అని.. సమీప భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా డబ్బు వస్తుందని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. ఇటువంటి కల మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు