Sita Samahit Sthal: సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
సీతా రాములు ఆదర్శ దంపతులు. పెళ్లి అయిన జంటను సీతారాముల్లా నిండు నూరేళ్ళు జీవించండి అని పెద్దలు దీవిస్తారు. సీతాదేవి అవతారం పరిసమాప్తం అయ్యే సమయం ఆసన్నం అయినప్పుడు తనువు చాలిస్తూ తన తల్లి అయిన భూదేవిలో ఐక్యం అయిపొయింది. రామాయణం ప్రకారం అటువంటి పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి ఈ రోజు తెలుసుకుందాం..

శ్రీరాముడు విడిచి పెట్టడంతో వాల్మికీ ఆశ్రమంలో చేరిన సీతమ్మ తల్లి తనువు చాలించిన పవిత్ర స్థలం ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది. దీనిని సీత సమాహిత్ స్థల్’ అని ‘సీత మారి’ అని పిలుస్తారు. ఇది వారణాసి అలహాబాద్ లను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఒక గుడి ఉంటుంది. దీనిని సీతాదేవి స్మారకం అని అంటారు.
ఈ అందమైన స్మారక కట్టడాన్ని 90వ దశకంలో నిర్మించారు. ఈ కట్టడం నిర్మించక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టుని తలపించే విధంగా కేశ వాటిక ఉండేదని స్థానికులు చెబుతారు. ఈ ప్రాంతంలో మొలచిన గడ్డిని పశువులు కూడా తినేవి కావట. అయితే ఇక్కడ స్మారకాన్ని నిర్మించే సమయంలో సీతా కేశ వాటికను అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. ఇక్కడే సీతాదేవి ఆశ్రయం పొందిందని.. సీత వటవృక్షం దగ్గరే లవకుశలకు జన్మనిచ్చిందని స్థానికులు చెబుతారు.
సీత స్మారకం భవనం రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపం లో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. భవనం కింద భాగంలో సీతాదేవి భూదేవిలోపలి చేరుకున్తున్నట్లుగా చూపించే సీతాదేవి ప్రతిమ కనిపిస్తుంది. ఈ విగ్రహం జీవ కళ ఉట్టిపడుతూ చూపరుల మనసుని కదిలిస్తుంది. భవనం గోడల మీద భూదేవిలో కలిసి పోతున్న సీతాదేవికి సంబంధించిన ప్రతి సంఘటనలు తెలియజేసే విధంగా అనేక చిత్రాలు, శిల్పాలు కనిపిస్తాయి.
ఈ స్మారక భవనాన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు నిర్మించారు. స్వామి జితేంద్రానంద సన్యాసం స్వీకరించిన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతున్నప్పుడు.. సీతాదేవి అనుగ్రహంతో కాలినడక 900 కిలోమీటర్ల ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తుంది. స్మారక భవన నిర్మాణం కోసం దాతల సాయం కోరారు.. ప్రకాశ్ పున్జ్ గారి సాయంతో స్మారక భవనం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు