Personality Test: మీకు ఏ ఐస్ క్రీమ్ ప్లేవర్ అంటే ఇష్టమో చెప్పండి.. అదే మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పేస్తుంది..
ఐస్ క్రీం పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఇక వేసవి కాలం వస్తే చాలు ఎండ నుంచి ఉపశమనం కోసం చల్ల చల్లని ఐస్ క్రీంని తినాలని కోరుకుంటారు. మార్కెట్లో రకరకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒకొక్క అభిరుచి ఉంటుంది. వేర్వేరు అభిరుచులను కలిగి ఉంటారు. అందుకే తమకి ఇష్టమైన ఐస్ క్రీంని తినడానికి ఇష్టపడతారు. మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తో మీ వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా సులభంగా తెలుసుకోవచ్చు,

ఈ సృష్టిలోని అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అందుకే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య స్వభావం, ప్రవర్తన, వైఖరులలో తేడాలు ఉంటాయి. అందుకనే తమ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు తమకు తెలిసిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవాలని కొంత మంది కోరుకుంటారు. వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారు నిలబడే భంగిమ, నిద్రించే భంగిమ, కూర్చునే భంగిమ, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, దంతాలు, నుదురు, కనుబొమ్మలు, కాలి వేళ్లు, వేళ్లు ద్వారా నిర్ణయించవచ్చు. అంతేకాదు మీరు ఇష్టపడే ఐస్ క్రీం రుచి కూడా మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. వెనిల్లా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి విభిన్న రుచులు మీ వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్నాయి. ఇవి మీలో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని తెలుసుకునేలా చేస్తాయి.
స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ రుచిని ఇష్టపడే వ్యక్తులు సహనం కలిగి ఉంటారు. వీరు అంతర్ముఖులుగా ఉంటారు. తమ పని ఏదో తాము అన్నట్లుగా ఉంటుంది వీరి ఆలోచన. తమని తాము పూర్తిగా పనికి అంకితం చేసుకుంటారు. వీరు తార్కికంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు నిజాయితీకి, విధేయతకు మారుపేరు అని చెప్పవచ్చు. ఎవరినీ మోసం చేయడం వీరికి ఇష్టం ఉండదు. అందరితో కలిసిపోయే గుణం వీరి సొంతం.
వెనిల్లా: వెనిల్లా రుచిని ఇష్టపడే వ్యక్తులు తొందరపాటు తనంతో ఉంటారు. వీరు ఆదర్శప్రాయులు, ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలను ధైర్యంగా, సులభంగా ఎదుర్కొంటారు. వీరు వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. తమ తర్కం కంటే తమ అంతర్ దృష్టిని ఎక్కువగా విశ్వసిస్తారు. అందువల్ల వీరు ఏమి చెయ్యాలన్నా తమ మనసు అంగీకరిస్తేనే ముందుకు అడుగు వేస్తారు.
చాక్లెట్: చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టపడే వ్యక్తులు హాస్య చతురులు. సరదాగా ఉంటారు. అమాయక స్వభావాన్ని కలిగి ఉంటారు. కొంచెం నాటకీయంగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలే ఇతరులను ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు వీరు కొంచెం ఘాటుగా, ముఖం మీద కొట్టినట్లుగా మాట్లాడతారు.
పుదీనా చాక్లెట్ చిప్ ఐస్‌క్రీమ్: పుదీనా చాక్లెట్ చిప్ ఇష్టపడే వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా నమ్మకంగా.. తార్కికంగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఇతరుల ముందు వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు వీరి ఆలోచనలు, మాటలు చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి.
కాఫీ ఐస్ క్రీం: కాఫీ రుచిగల ఐస్ క్రీం ఇష్టపడే వ్యక్తులు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోరు. అందరితో కలిసిపోతారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
చాక్లెట్ చిప్ ఐస్‌క్రీమ్ : చాక్లెట్ చిప్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీం ఇష్టపడే వారు ఉదారంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చక్కగా ఎలా నిర్వహించాలో వీరికి తెలుసు. ఎవరినీ నొప్పించకుండా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరు దృఢ నిశ్చయంతో ఉంటారు. జీవితంలో తీసుకునే నిర్ణయాలలో ఎటువంటి సంకోచం ఉండదు. తమ కెరీర్‌లో విజయం సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








