Mangal Gochar: ఏప్రిల్ 3న రాశిని మార్చుకోనున్న కుజుడు.. ఈ మూడు రాశుల ఉద్యోగ, వ్యాపారస్థులు నక్కన తొక్కినట్లే..
అమ్మవారిని కొంతమంది చైత్ర నవరాత్రుల్లో కూడా పుజిస్తారు. ఇప్పటికే చైత్ర నవరాత్రులు మొదలయ్యాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. కుజుడు నవరాత్రి రోజుల్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు. కుజుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుజ గ్రహం రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజు రాశులు ఏమిటో తెలుసుకుందాం.

చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పుజిస్తారు. నవరాత్రి సమయంలో గ్రహాలు రాశులను మార్చుకుంటాయి. గ్రహాల్లో భూమి కుమారుడు అయిన కుజుడు ప్రస్తుతం గ్రహాలకు రాకుమారుడు బుధుడు అధినేత అయిన మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు త్వరలో రాశిని మార్చుకోబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో కుజ గ్రహం రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం..
కుజుడు ధైర్యం, శక్తి, శౌర్యం, భూమి, రక్తం, సోదరుడు, యుద్ధానికి, శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలకు కారకుడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు త్వరలో మిథున రాశి నుంచి చంద్రునికి చెందిన కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు. ఏప్రిల్ 3న కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 1:35 గంటలకు కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తరువాత జూన్ 7 వరకు ఈ రాశిలో సంచరించనున్నాడు. కుజ గ్రహం రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రోజు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.
కన్య రాశి: కుజుడు రాశిలో మార్పు వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు అనుకూలమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ సమయంలో కన్య రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలగవచ్చు. వీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త ఉద్యోగం రావచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అవకాశాలు పొందవచ్చు. పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
తులా రాశి: కుజుడు రాశిని మార్చుకోవడం వలన తుల రాశి వారికి శుభప్రదం. వీరికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో తుల రాశి వారికి డబ్బు అందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందవచ్చు. దుర్గాదేవి నుంచి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యాపారుస్తులు లాభాలు పొందగలరు. చేపట్టిన అన్ని పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశికి చెందిన వారికి కుజుడు రాశిలో మార్పు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో చేసే చిన్న చిన్న ప్రయాణాలు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. అంతేకాదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు లాభిస్తాయి. భూమి వ్యాపారంలో లాభం ఉండవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు