Vastu Tips: ఈ వస్తువులను పొరపాటునైనా కాలితో తాకితే ఆర్ధిక ఇబ్బందులకు వెల్కం చెప్పినట్లే..
హిందూ మతంలో సృష్టిలో ప్రతి జీవిలో దేవుడిని చూస్తారు. కొన్ని వస్తువులను దేవుళ్ళు , దేవతల చిహ్నాలుగా పరిగణిస్తారు. అందుకనే దైవానికి అవి ప్రతిరూపాలుగా భావించి పొరపాటున కూడా వాటిని కాలితో తాకరాదని చెబుతారు. ఇలా కొన్ని వస్తువులను పోరాటునైనా కాలితో తాకితే జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా కొన్ని వస్తువులను కాలితో తాకితే ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి. డబ్బు కొరత ఏర్పడుతుంది.

మన దైనందిన జీవితంలో హిందూ మతం ప్రకారం దేవుళ్ళు, దేవతల చిహ్నాలుగా పరిగణించే అనేక వస్తువులను మనమందరం ఉపయోగిస్తాము. కనుక ప్రతి వస్తువుని కావలసిన చోట ఉంచలేరు. జంతువులు, పక్షులలో దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం ఈ జంతువులు, పక్షులు లేదా వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకరాదు. ఇలా కాలితో తాకడం అంటే దేవుళ్ళను అగౌరవపరిచినట్లు పరిగణించబడుతుంది. ఇది పాప కర్మాగా భావిస్తారు. అంతేకాదు ఇలాంటి కర్మలకు శిక్ష మరణానంతర అనుభవించాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఏ వస్తువులను కాలితో తాకరాదో తెలుసుకుందాం..
ఆవు: హిందూ మతంలో ఆవును దేవతగా పూజిస్తారు. గోమాతలో సకల దేవతలు నివసిస్తారని నమ్మకం. దైవంగా భావించే ఆవుని పొరపాటున కూడా కాలితో తన్నరాదు. ఆవుపై ఎప్పుడూ కాలు వేయకూడదు. ఆవుని కాలితో తాకడం వలన తెలివితేటలు నశిస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
ఇత్తడి, రాగి పాత్రలు : ఇత్తడి, రాగి లోహం సూర్యభగవానుడిని సూచిస్తుంది. కనుక సూర్యుడికి రాగి లేదా ఇత్తడి పాత్రలతో నీరుతో అర్ఘ్యం ఇస్తారు. కనుక ఈ లోహంతో చేసిన పాత్రలను కాలితో తన్నరాదు. ఇలా చేయడం వలన జాతకంలో చంద్రుడు బలహీనంగా మారవచ్చు. జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తడం ప్రారంభం అవుతాయి.
శంఖం: పురాణ శాస్త్రాల ప్రకారం దేవతలు సమస్త ప్రాణుల్లో నివసిస్తారు. మనం నివసించే భూమి.. భూమి మీద ఉన్న సమస్త జీవులు కూడా పవిత్రమైనది. ఎందుకంటే హిందూ మతంలో భూమిని తల్లిగా భావిస్తారు. శంఖం కనుక మీ ఉంటే.. దానిని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు. లక్ష్మీ దేవి శంఖంలో నివసిస్తుంది. శంఖం మీద కాలు వేయడం వల్ల మీ పాదం తెగిపోవడమే కాదు.. ఆర్థిక నష్టానికి కూడా దారితీయవచ్చు.
చీపురు: చీపురును లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా కూడా పరిగణిస్తారు. అందుకే చీపురిని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు. చీపురు పేదరికాన్ని తొలగిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది.
ఆహారం, పానీయం: ఏదైనా ఆహార పదార్ధాన్ని కాలుతో తాకడం నిషేధించబడింది. ఎటువంటి ఆహరాన్ని అయినా సరే కాలితో తాకరాదు. అంతేకాదు పూజా వస్తువులను లేదా పూజలో ఉపయోపోగించే వస్తువులను పొరపాటున కూడా తన పాదాలతో తాకకూడదు.ఇలా చేయడం వలన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
తులసి దళాలు: తులసి మొక్కకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి దళాలు కూడా లక్ష్మి నివాసంగా భావిస్తారు. కనుక తులసి దళాలను ఎప్పుడూ పాదాలతో తాకకూడదు. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు కలగవచ్చు. దీనితో పాటు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక తెలిసి తెలియక, పొరపాటున తులసి దళాలపై అడుగు పెట్టవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు