Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా..? మీ అదృష్టాన్ని దూరం చేసేవి ఇవే..!

చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకునే అలవాటు చేసుకుంటారు. కొందరు ఆరోగ్య కారణాల వల్ల, మరికొందరు ఫ్యాషన్ కోసం ఇలా చేస్తారు. అయితే వాస్తు ప్రకారం చెప్పులు ఇంట్లో సరిగ్గా ఉంచకపోతే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి ఇంట్లో చెప్పులు ఎలా ఉంచాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా..? మీ అదృష్టాన్ని దూరం చేసేవి ఇవే..!
Vastu Footwear Rules
Follow us
Prashanthi V

|

Updated on: Apr 01, 2025 | 9:49 PM

చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతారు. కొందరు ఆరోగ్య కారణాల వల్ల, మరికొందరు స్టైల్ కోసం ఫ్యాన్సీ స్లిప్పర్లు వాడుతారు. అయితే పెద్దలు గుమ్మం దగ్గర చెప్పులు తీసేయాలని చెబుతారు. బంధువులైతే ఇంటి గుమ్మం వద్ద, ఇతరులు గేటు దగ్గర చెప్పులు విడవాలి. కానీ ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.

వైద్యులు, ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దవాళ్లు చెప్పులు లేకుండా నడవకూడదని సూచిస్తారు. అయితే ఇప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. నిజంగా ఇది ఇంటికి మంచిదా..? కాదా అనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి బయట వేసుకునే చెప్పులు, బూట్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. వాస్తు ప్రకారం బయట మురికి, నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తాయి. ఇది కుటుంబానికి సమస్యలు తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతారు.

చాలా మంది చెప్పులను గుమ్మం ముందు చిందరవందరగా పడేయడం అలవాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇది దోషంగా పరిగణిస్తారు. చెప్పులు క్రమంగా ఉంచకపోతే శని ప్రభావం ఎక్కువ అవుతుందని నమ్ముతారు. మానసిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని చెబుతారు.

వాస్తు ప్రకారం చెప్పులు పడమర దిశలో ఉంచడం మంచిది. మెట్ల కింద చెప్పులు ఉంచరాదు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మం వద్ద చెప్పులు తీసేయడం మర్చిపోవద్దు.

కాళ్లు నేలకి తగులుతూ నడవడం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్లు సున్నితంగా మారిపోతాయి. ఒకసారి అలవాటు అయితే చెప్పులు లేకుండా నడవడం కష్టమవుతుంది. అందుకే రోజులో కొంతసేపు చెప్పులు లేకుండా నడవాలి. నరాలు ఉత్తేజితమవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

ఆరికాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు చెప్పులు లేకుండా నడవకూడదని వైద్యులు సూచిస్తారు. అలాంటి వారు ఇంట్లో చెప్పులు వేసుకోవచ్చు. పవిత్ర ప్రదేశాలు, దేవాలయాల్లో చెప్పులు బయటే విడిచిపెట్టాలి. ఇంట్లో కూడా పూజ గది, వంట గది, డబ్బులు ఉండే ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవాలి.

డబ్బులు ఉన్న ప్రదేశానికి చెప్పులతో వెళితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని చెబుతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం ఉంది. వంటగదిలో చెప్పులు వేసుకోవడం తల్లి అన్నపూర్ణకు అపచారంగా భావిస్తారు. దీనివల్ల జీవితంలో కష్టాలు వస్తాయని పెద్దలు చెబుతారు.

ఇంట్లో చెప్పులు వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అయితే ఆరోగ్యం, వాస్తు దృష్ట్యా కొన్ని నియమాలను పాటించడం మంచిది. ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం, ఆధ్యాత్మికంగా శుభతను పెంచుకోవడం కోసం చెప్పులను సరైన ప్రదేశంలో ఉంచడం అవసరం.