Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రతి మనిషి కలలు కనడం సర్వసాధారణం. కొన్ని సార్లు మన చుట్టూ జరిగిన సంఘటనల ప్రభావంతో కలలు వస్తాయి. ఈ కలల్లో కొన్ని సంతోషాన్ని కలిగిస్తే.. మరొకొన్ని భయపెడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరినైనా ముద్దు పెట్టుకుంటున్నట్లు మీ కలలో కనిపిస్తే.. ఆ కలలకు కూడా వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా కలలో ఎవరో తెలియని వ్యక్తిని అంటే అపరిచితుడిని ముద్దు పెట్టుకున్నట్లు కల వస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఏమిటో మీకు తెలుసా?

మనం రోజంతా మన చేతన, ఉపచేతన సమయంలో మనస్సులలో మనం ఏమి ఆలోచిస్తామో, లేదా ఏమి సాధించాలనుకుంటున్నామో దాని గురించి కలలు కంటాము. కొన్నిసార్లు అటువంటి కలలు చాలా మధురంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి భయంకరమైన పీడకలగా మారతాయి. చాలా సార్లు మనం మన మనసులో ఉన్న వ్యక్తుల గురించి కలలు కంటాము. కొన్నిసార్లు మనం కలలో వేరొకరిని ముద్దు పెట్టుకుంటాము. మీరు దీనిని కేవలం ఒక కల అని కొట్టిపారేస్తే మీరు తప్పు. భవిష్యత్తులో జరిగే సంఘటనలకు రాత్రి మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ కలలో ఎవరిని ముద్దు పెట్టుకుంటారో దానికి వేర్వేరు అర్థాలు ఉంటాయి. అపరిచితుడిని ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటో మీకు తెలుసా? జీవితంలో జరిగే సంఘటనల గురించి ముందుగా సూచనలను ఇస్తాయని అంటున్నారు.
మీ తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుంటున్నట్లు కలలు కనడం – మీరు మీ తల్లి లేదా తండ్రిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కలలు కన్నట్లయితే.. అది అదృష్టాన్ని తీసుకొచ్చే కలగా పరిగణించబడుతుంది. ఇది మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న బాధ్యతను అభిమాన్ని ఆందోళనకు కూడా వ్యక్తపరుస్తుంది. ఇటువంటి కల మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది.
ఒక అపరిచితుడిని ముద్దు పెట్టుకుంటున్నట్లు కలలు కనడం – మీరు మీ కలలో ఒక అపరిచితుడిని ముద్దు పెట్టుకుంటే, జీవితంలో పూర్తిగా కొత్త విషయాలను కనుగొనడానికి మీరు చాలా ఆసక్తిగా ఉన్నారని అర్థం. మీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, కొత్త వాటిని ప్రయత్నించడానికి ఇష్టపడతారు. లేదా మీరు కొత్తగా ఏదైనా సాధించాలని కోరుకుంటారు.
కలలో బంధువును ముద్దు పెట్టుకోవడం – మీరు కలలో మీ సోదరి లేదా సోదరుడిని బుగ్గపై ముద్దు పెట్టుకుంటే, ఈ కల అంటే మీ ఇద్దరి మధ్య సంబంధం బలంగా మారుతుందని. మీరిద్దరూ ఒకరినొకరు బాగా చూసుకుంటారని అర్థం. ప్రేమగా ఉంటారని అర్ధం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు