- Telugu News Photo Gallery Spiritual photos These are most famous sea side temples of India for summer vacations
Divine Trips: వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నారా.. సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయాల గురించి తెలుసుకోండి..
భారతదేశంలో లెక్కలేనన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొండ కోనల్లో, సముద్ర తీరాల్లో, ఎత్తైన పర్వతాల మీద ప్రత్యేక అనుభవాలతో మరపురాని జ్ఞాపకాలను అందించే అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాలు వాటి వాస్తు శిల్పంతో పాటు ఆకర్షణీయమైన ప్రదేశానికి ప్రసిద్ధి చెందాయి. సముద్రం తీరంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం..
Updated on: Apr 02, 2025 | 1:59 PM

భారతదేశం అధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ అత్యంత పురాతన చారిత్రక, ఆకర్షణీయమైన నిర్మాణ శైలి కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రకృతి అందాల నడుమ కనులకు విందు కలిగిస్తూ.. మన మనసును దోచుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి. సముద్ర తీరంలో లేదా సముద్ర తీరానికి దగ్గరగా కొన్ని దేవాలయాలను చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. వేసవి కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా.. పుణ్యం, పురుషార్ధం కలిసి వచ్చే విధంగా ప్రసిద్ధి చెందిన ఐదు దేవాలయాల గురించి తెలుసుకుందాం..

భగవతి అమ్మన్ ఆలయం, తమిళనాడు : ఈ ఆలయం పార్వతి దేవి స్వరూపమైన భగవతి దేవికి అంకితం చేయబడింది. దీనిని సాంస్కృతిక వారసత్వ ఆలయంగా కూడా పిలుస్తారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయం సముద్ర తీరంలో నిర్మించబడింది. 3000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయం. ఇక్కడ ఏడాది పొడవునా భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది. అజి

అజిమల శివాలయం, కేరళ : మీరు కేరళలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తిరువనంతపురం సందర్శించబోతున్నట్లయితే మీరు అరేబియా సముద్ర తీరంలో ఉన్నహిందూ దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ శివుడికి అంకితం చేయబడిన అజిమల ఆలయం కూడా ఉంది. ఇది ఉదయం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ వాతావరణం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం 18 మీఎత్తైన గంగాధరేశ్వర శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అజిమల బీచ్‌ను కూడా సందర్శించవచ్చు.

రామనాథస్వామి ఆలయం, తమిళనాడు : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇది రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఈ ఆలయం సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వెళ్ళేవారు ఖచ్చితంగా అక్కడ ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేస్తారు.

గణపతిపులే ఆలయం మహారాష్ట్ర: మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధ చెందిన గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రత్నగిరికి సమీపంలో ఉన్న గణపతిపులే ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇది తీరప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి తప్పనిసరిగా వెళ్లడమే కాదు.. గణపతిపులేలో ఎన్నో సాహసోపేత కార్యకలాపాలను చేయవచ్చు.

ఒడిశాలోని కోణార్క్ వద్ద ఉన్న సూర్య దేవాలయం : ఒడిశాలోని కోణార్క్ వద్ద ఉన్న సూర్య దేవాలయం ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ఇక్కడ పూరి జగన్నాథ రథయాత్ర ఎంత ఫేమస్సో... ఇక్కడ ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం కూడా అంతే ఫేమస్. కనుక కోణార్క్ దేవాలయాన్ని తప్పక సందర్శించండి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గర ఉంది. సముద్ర తీరం దగ్గర దేవాలయం అందాలను చూసిన తర్వాత ఒక మధురమైన జ్ఞాపకంగా ఆ దృశ్యాలు మిగిలిపోతాయి.

మహాబలేశ్వర్ ఆలయం, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని శివుడికి అంకితం చేయబడిన మహాబలేశ్వర్ ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు, పర్యాటకుల రద్దీతో సందడిగా ఉంటుంది.

మురుడేశ్వర ఆలయం కర్ణాటక : భారతదేశంలోని సముద్ర తీరంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి మురుడేశ్వర ఆలయం. ఈ ఆలయం వెలుపల అరేబియా సముద్రానికి ఎదురుగా దాదాపు 123 అడుగుల (సుమారు 20 అంతస్తులు) భారీ శివుని విగ్రహం ఉంది. ఇక్కడ అద్భుతమైన అందాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదు మురుడేశ్వర్ బీచ్ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిచెందింది.




