- Telugu News Photo Gallery Spiritual photos Jupiter enters Mrigasira Nakshatra, good luck for three zodiac signs
గురు సంచారం.. అదృష్టం పట్టనున్న మూడు రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఉండే ప్రాముఖ్యతే వేరు. గురు అనుకూలంగా ఉండే ఆ రాశుల వారికి సిరుల పంట పండినంట్లే అంటారు. అంతే కాకుండా గురు సంచారం వలన కూడా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. అయితే ఏప్రిల్ 10న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు. దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట.
Updated on: Apr 01, 2025 | 9:46 PM

గ్రహాలు ఒకరాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం చాలా కామన్. అయితే గ్రహాలలో సంపద, విద్య, ధర్మానికి సంబంధించిన గురు గ్రహాం తన నక్షత్ర రాశిని మారుస్తున్నాడు. దీని ప్రభావం 12 రాశులపై పడనుంది.

ముఖ్యంగా గురు సంచారం వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఏప్రిల్ 10 సాయంత్రం 7.51 నిమిషాలకు గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన మేష, కర్కాటక, తులా రాశి వారికి కలిసి వస్తుందంట.

మేషరాశి : ఈ రాశి వారికి గురు సంచారంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురుసంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.

తులా రాశి : ఈ రాశి వారికి గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడం వలన అనేక లాభాలు చేకూరుతాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నూతన గృహం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.





























