శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
హిందువులు దర్శించుకునే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి ద్వారక. పురాణాల ప్రకారం ద్వారక సప్త ముక్తి స్థలంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ద్వారకాధీషుడి ఆలయం ఉంది. దీనిని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. సప్త ధామాల్లో ఒకటైన ద్వారక నగరం గుజరాత్‌లో ఉంది. ఈ ఆలయం ద్వారకాధీశుడు లేదా 'ద్వారక రాజు' గా పూజించబడే శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం హిందూ మతంలో చార ధామ లో ఒకటి, వైష్ణవ భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం.

గుజరాత్‌లోని ద్వారక నగరంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం ద్వారకాధీషుడి ఆలయం. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. హిందూ మతంలోని నాలుగు ధమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించాడని నమ్ముతారు. ఈ ప్రదేశం ఆయన లీలలతో ముడిపడి ఉంది. తన పుట్టినరోజుకు ముందు అనంత్ అంబానీ ఈ ఆలయంలో ద్వారకాదీషుడి ఆశీస్సులు పొందడానికి జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీ. మేర పాదయాత్రను చేపట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఏప్రిల్ 10న తన 30వ పుట్టినరోజును ఈ ఆలయంలో జరుపుకోవాలని భావిస్తున్నారు. అందుకనే నడకతో ఆలయానికి పయణం అయ్యారు. అనంత్ అంబానీకి ద్వారకాధీశుడు పట్ల అమితమైన విశ్వాసం ఉందని తన పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారని చెబుతున్నారు.
ద్వారకాధీశ ఆలయ నిర్మాణం
ద్వారకాధీశ ఆలయం శ్రీ మహా విష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో ఉంది. ఈ ఆలయ అసలు నిర్మాణం దాదాపు 2,500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు చేశాడని నమ్ముతారు. ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఆలయం నిర్మాణం 15-16వ శతాబ్దంలో విస్తరించబడింది.
ప్రత్యేక నిర్మాణం ఈ ఆలయం సొంతం
ఈ ఆలయం దాని వైభవం, అందమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ శిఖరం 78.3 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ శిఖరంపై ఒక పెద్ద జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుంది. ఈ ఆలయం ఐదు అంతస్తుల నిర్మాణం. 72 స్తంభాలపై ఆలయం ఆధారపడి ఉంది. దీని శిఖరం 78.3 మీటర్ల ఎత్తు, ఆలయం సున్నపురాయితో తయారు చేయబడింది. ఇప్పటికీ దీని సహజ అందాలను కోల్పోకుండా భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
ద్వారకాధీశ ఆలయం పురాణ ప్రాముఖ్యత
ఈ ద్వారకాధీశ ఆలయాన్ని శ్రీ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరంలో నిర్మించబడిందని నమ్ముతారు. శ్రీ కృష్ణుని మనుమడైన వజ్రనాభుని (అనిరరద్ధుడి సంతానం) హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) అనే ఆలయన్ని నిర్మించాడు. సా.శ.పూ. 400 సంవత్సరంలో శ్రీ కృష్ణుని మునిమనుమడైన వజ్రనాభుడు ఒక గొడుగు తరహాలో ఆలయాన్ని నిర్మించి.. తన తాతగారైన కృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించినాడు. ఆదిశంకరాచార్యులు ద్వారకాధీష్ ఆలయాన్ని పునరుద్ధరించారు. కాల క్రమంలో వివిధ పాలకుల హయాంలో ఆయా కాలానుగుణంగా అనేక మార్పులు జరిగాయి.
ద్వారకాధీశ ఆలయం మతపరమైన ప్రాముఖ్యత
ఈ ఆలయం వైష్ణవ భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ద్వారకాధీశ ఆలయం శ్రీ కృష్ణుడి జన్మాష్టమి తర్వాత ధనకానాను పంపిణీ చేసే ప్రత్యేక సంప్రదాయంతో ప్రసిద్ధి చెందింది. ఢంకానాను దోచుకునే సంప్రదాయం ఇక్కడ చాలా సంవత్సరాలుగా ప్రబలంగా ఉంది. ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమికి ఒక రోజు ముందు శ్రీకృష్ణుని జన్మని గుర్తుచేసుకోవడానికి జరుపుకుంటారు. ఈ ఆలయం మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే ముఖ్యమైనది కాదు.ఇది భారతీయ కళ, సంస్కృతికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కూడా నిలుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు