AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయాల ఊరు.. ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు! ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే..

వెల్లుల్ల గ్రామం, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో ఉంది. ఈ చిన్న గ్రామంలో 70కి పైగా ఆలయాలు, ముఖ్యంగా 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీరిన తర్వాత కొత్త ఆలయాల నిర్మాణం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఆలయంలోనూ నిత్య పూజలు జరుగుతాయి.

ఆలయాల ఊరు.. ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు! ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే..
Vellulla Village
G Sampath Kumar
| Edited By: SN Pasha|

Updated on: Apr 03, 2025 | 2:14 PM

Share

ఏ గ్రామంలోనైనా ఒకటో, రెండో ఆలయాలు ఉంటాయి. కానీ, ఈ గ్రామంలో మాత్రం ఏకంగా 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. అయితే ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు. అయితే మరి ఈ గ్రామంలో ఎందుకు ఇన్ని ఆలయాలు నిర్మించారో తెలుసుకుందాం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 2 వేలకు పైగా జనాభా ఉన్నారు. జనాభా పరంగా, విస్తీరణం పరంగా వెల్లుల్ల గ్రామం చిన్నదే అయినప్పటికీ.. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.

చాలా పురాతమనమైన ఈ గ్రామంలో 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. గతంలో ఉండే ఆలయాల్లో కోరిన కోరిక తీరితే.. కొత్త ఆలయాలు నిర్మిస్తామని భక్తులు మొక్కుకునే వారు. అలా కోరిన కోరికలు తీరిన వారు ఆలయాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీ అలా కొనసాగుతోంది. అయితే ఈ గ్రామంలో హనుమాన్ భక్తులు ఎక్కువగా ఉంటారు. ప్రతి హనుమాన్ జయంతీకి హనుమాన్ మాలలు ధరించి ఉపవాసం ఉంటారు. మొత్తం 70 ఆలయాల్లో అత్యధికంగా 54 ఆలయాలు హనుమాన్‌ ఆలయాలే ఉన్నాయి.

ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఆధ్మాత్మిక వాతవరణం కనబడుతుంది. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. గతంలో కూడా ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అయితే.. స్థానికులే ఎక్కువగా ఆలయాలు నిర్మించారు. ఇక్కడ ప్రతి పర్వదినం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వెల్లుల్ల గ్రామాన్ని దేవాలయాల గ్రామంగా పిలుస్తున్నారు. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న ఆలయాలను చూసేందుకు ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఆలయాలు ఉన్న గ్రామం ఎక్కడా లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!