Kubera Yoga 2025: ఈ రోజు ఏర్పడిన కుబేర యోగం.. అదృష్టం అంటే ఈ మూడు రాశులవారిదే.. మీరున్నారా
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల, రాశులు, నక్షత్రాలు ప్రాముఖ్య స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి సంచరిస్తాయి. ఇలా గ్రహాలు సంచరించే సమయంలో వేరొక గ్రహాన్ని కలుసుకుంటాయి. అప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మనిషి జీవితంలో మంచి, చెడులకు కారణమవుతాయి. కొన్ని యోగాలు మంచి రోజులు తీసుకుని వెళ్తాయి. అప్పుడు వారి అదృష్టం ఒక్కసారిగా వెలిగిపోతుంది. మట్టి పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ఆలాంటి యోగాలలో కుబేర యోగం ఒకటి. ఈ రోజున కుబేర యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో మొత్తం 12 రాషులపై ఉన్నా.. మూడు రాశులు మాత్రం ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది.

నవ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి. ఇలా గ్రహాలు సంచరించే సమయంలో కొన్ని శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మనిషి జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అంతవరకూ తాబేలుగా సాగిన జీవితం.. ఒక్కసారిగా మారిపోతుందని పిస్తుంది ఈ సమయంలో. బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, గజకేసరి యోగం, త్రిగ్రహి యోగం, కుబేర యోగం, పారిజాత యోగం ఇలా రకరకాల పేర్లతో యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. తాజాగా ఈ రోజు కుబేర యోగం ఏర్పడింది. ధనానికి అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం ఉంటే.. ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు ఉందని జ్యోతిష్యులు చెబుతుంటారు. అటువంటి కుబేరుడు అనుగ్రహించే కుబేర యోగం ఈ రోజు ఏర్పడింది. దీంతో మూడు రాశుల వారు ఏ పని మొదు పెట్టినా ఆ పని శరవేగంగా పూర్తవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశుల వారు కుబేరుడి అనుగ్రహం వలన మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. ఆ రాశులు ఏమిటంటే..
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేర యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. మీవల్ల ఇప్పటికే లాభపడిన వారు తిరిగి సహాయం చేసేందుకు ముందుకొస్తారు. అండగా నిలబడతారు. అంతేకాదు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్తారు. కొత్త పనులు మొదలు పెడతారు. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి తగాదాలు తీరితాయి. పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి.
తులారాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేర రాజయోగం అంతవరకూ నత్త నడకన నడిచిన పనులన్నీ శరవేగంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆర్ధికంగా అన్ని విధాలా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారాస్తులకు కుబేర యోగం వలన కలిసి వస్తుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడులకు పదింతలు లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా వీరి మాట చెల్లుబాటు అవుతుంది.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేర యోగం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంపాదన పెరుగుతుంది. తలపెట్టిన శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రూపాల్లో డబ్బులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డబ్బులు ఖర్చు పెట్టె విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు పెడితే యథాస్థితికి చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు