Video: మాస్ రివేంజ్! పాక్ స్పిన్నర్ ని గ్రౌండ్ లోనే నిలదీసిన గిల్ లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఓ భారతీయ మహిళా అభిమాని ప్రశ్నించడంతో వీడియో వైరల్ అయింది. శుబ్‌మన్ గిల్‌పై గతంలో చేసిన వికెట్ సెలబ్రేషన్ గురించి ఆమె క్వశ్చన్ చేయగా, అబ్రార్ అసహనంగా నవ్వుతూ తప్పించుకున్నాడు. పాకిస్తాన్ వరుసగా మరో ఓటమిని మూటగట్టుకోగా, ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత అభిమానులు దీన్ని ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తుండగా, పాక్ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

ఏప్రిల్ 2న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ మరో ఘోర ఓటమిని చవిచూసింది. మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 292 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అభిమానులు వేల సంఖ్యలో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి తరలివచ్చారు. అయితే, మ్యాచ్ కంటే ఎక్కువగా అబ్రార్ అహ్మద్‌పై జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ vs పాకిస్తాన్ పోరులో అబ్రార్ అహ్మద్ తన వికెట్ సెలబ్రేషన్ కారణంగా వివాదాస్పదంగా మారాడు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఒక మహిళ అభిమాని న్యూజిలాండ్‌లో అబ్రార్ అహ్మద్‌ను ప్రత్యక్షంగా ప్రశ్నించడంతో ఆయన ఇబ్బందికర స్థితిలో పడ్డాడు. మహిళ అతడిని చూస్తూ, “శుబ్‌మాన్ గిల్ కో క్యా ఇషారే కర్ రా థా?” (శుబ్‌మాన్ గిల్‌కు మీరు ఏమని వార్నింగ్ ఇచ్చారు?) అని అడిగింది. ఈ ప్రశ్న విన్న అబ్రార్ అసహనంగా నవ్వుతూ అక్కడి నుంచి తప్పించుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం వన్డే జట్టులో లేను, కానీ T20I ఫార్మాట్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన T20I సిరీస్‌లో ఐదు వికెట్లు తీసి మంచి రికార్డ్ నెలకొల్పాడు. వన్డేల్లో మాత్రం అతనికి ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు లభించలేదు.
ప్రస్తుతం పాకిస్తాన్ తన మూడో వన్డేను ఏప్రిల్ 5న న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ డెడ్ రబ్బర్ మ్యాచ్ మాత్రమే, ఎందుకంటే న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. యితే, అబ్రార్ అహ్మద్‌పై జరిగిన ఈ సంఘటన అభిమానుల్లో మంచి చర్చకు దారితీసింది. మరి ఆయన తిరిగి వన్డే జట్టులోకి రావటానికి ఎంతకాలం పట్టదో చూడాలి!
అబ్రార్ అహ్మద్‌కు సంబంధించిన ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొంత మంది అభిమానులు అబ్రార్‌ను మద్దతుగా నిలవగా, మరికొందరు అతని అనవసరమైన సెలబ్రేషన్ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అయితే, అబ్రార్ ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు. మరోవైపు, భారత క్రికెట్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సరదా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనితో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ రైవల్రీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
— urooj Jawed 🥀 (@cricketfan95989) April 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



