ఇది కదా అసలైన లైవ్ మ్యూజిక్..వీడియో
సమాజంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందిరికి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది.. ఇలాంటివారు వీలు చిక్కినప్పుడల్లా ఏదొక స్టెప్ వేస్తూనే ఉంటారు. అలాగే కొందరు మ్యూజిక్ అంటే లైక్ చేస్తారు. వీరు ఏ పని చేస్తున్నా ఏదొక హమ్ చేస్తుంటారు. చేతికి ఏది దొరికితే దానిపైన మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ప్లే చేస్తున్న గిటార్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ వీడియో తీసుకుంటున్నాడు.
ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే.. అతను వాయిస్తున్నది అసలైన గిటార్ కాదు.. గిటార్ ఆకారంలో ఉన్న ఓ ఇనుప వస్తువు. ఈ యువకుడు వెల్డర్‌గా పనిచేస్తున్నాడు అనుకుంటా.. అతను వాయిస్తున్న గిటార్ చూస్తుంటే అతనికి మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతోంది. అతను ఓ ఇనుప రేకును గిటార్ ఆకారంలో కట్ చేసి.. దానిపై వెల్డింగ్ హ్యాండిల్‌తో నిప్పులు పుట్టిస్తూ గిటార్ వాయిస్తున్నట్లు నటిస్తున్నాడు. దూరం నుంచి చూసేవారికి.. అతను గిటార్ వాయిస్తుంటే అందులో నుంచి నిప్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఇతను ఇనుప గిటార్‌తో నిప్పులు పుట్టిస్తూ లైవ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో