Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder Case: డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలని.. అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేస్తోన్న శ్రద్దా తండ్రి వికాస్

సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్‌ అప్లికేషన్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్‌ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు.

Shraddha Murder Case: డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలని.. అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేస్తోన్న శ్రద్దా తండ్రి వికాస్
Shraddha Walker Case Update
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2022 | 6:50 AM

యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు ఎన్నో మలుపులు, మరెన్నో ట్విస్ట్‌లతో సంచలనాలు రేపుతోంది. శ్రద్ధా హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ నోరు విప్పారు. ఆయన ఏం చెప్పారు? కన్న కూతురుని కోల్పోయిన తండ్రి ఆవేదన బాధ ఏమిటి.. డేటింగ్ యాప్ లపై కూడా వికాస్ స్పందించారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్‌కీ అలాంటి పనిష్మెంట్‌ ఇవ్వాలని శ్రద్ధ తండ్రి వికాస్‌ వాకర్‌ డిమాండ్‌ చేశారు. పోలీసులు సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్‌ని ఉరితీయాలన్నారు. అఫ్తాబ్‌ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు శ్రద్దా తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానన్నారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని చెబుతున్నారు.

సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్‌ అప్లికేషన్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్‌ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్‌ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదన్నారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు.

తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్‌ వాకర్ చెప్పారు. అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలా జ్యుడీషియల్‌ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..