Gold Price Today: బంగారం ప్రియులకి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌. తులంపై ఎంతంటే..

శుక్రవారం ఒక్క రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. తులం గోల్డ్‌పై ఒకేసారి ఏకంగా రూ. 290 పెరగడం గమనార్హం. ఇక గడిచిన వారం రోజులుగా ప్రతి రోజూ గోల్డ్‌ రేట్ పెరుగుతూనే ఉంది...

Gold Price Today: బంగారం ప్రియులకి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌. తులంపై ఎంతంటే..
Gold And Silver Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 10, 2022 | 6:26 AM

శుక్రవారం ఒక్క రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. తులం గోల్డ్‌పై ఒకేసారి ఏకంగా రూ. 290 పెరగడం గమనార్హం. ఇక గడిచిన వారం రోజులుగా ప్రతి రోజూ గోల్డ్‌ రేట్ పెరుగుతూనే ఉంది. గడిచిన పది రోజుల్లోనే ఏకంగా తులం బంగారంపై సుమారు వెయ్యి రూపాయలు పెరగడం విశేషం. పెళ్లిళ్ల సీజన్‌, బంగారానికి డిమాండ్ పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం నమోదైన బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 49,900 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 54,440 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 54,280 గా నమోదైంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 50,470 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 55,060 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 54,330 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,280 గా ఉంది.

* విజయవాడలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 49,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,280 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉండగా ముంబైలో కిలో వెండి ధర రూ. 67,600 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500 వద్ద కొనసాగుతుండగా, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,500 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..