BSNL 5g: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్.. 5జీ సేవలు అందుబాటులోకి, ఎప్పటినుంచంటే..

5జీ సేవల కోసం ఎదురుచూస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌. త్వరలోనే మీ ఎదురుచూపులు ఫలించనున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ టెలికం కంపెనీలు పోటాపోటీగా 5జీ సేవలను..

BSNL 5g: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్.. 5జీ సేవలు అందుబాటులోకి, ఎప్పటినుంచంటే..
Bsnl 5g Services
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2022 | 1:34 PM

5జీ సేవల కోసం ఎదురుచూస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌. త్వరలోనే మీ ఎదురుచూపులు ఫలించనున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ టెలికం కంపెనీలు పోటాపోటీగా 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టవర్లను అప్‌డేట్‌ చేయనున్నారు. ఇప్పటికే 4జీ సేవలను సమర్థవంతంగా అందిస్తోన్న ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ టెక్నాలజీని సైతం అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ సేవలను రానున్న 5 నుంచి 7 నెలల్లో 5జీకి అప్‌డేట్ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ గురువారం అధికారికంగా తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 1.35 లక్షల టెలికాం టవర్లను అప్‌డేట్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సీఐఐ ఈవెంట్‌లో అశ్వనీ వైష్ణవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా టెలికాం టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏడాదికి రూ. 500 కోట్ల నుంచి రూ. 4000 కోట్లకు పెంచడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుందన్నారు. టెలికాం రంగంలో స్థిరత్వం తీసుకురావడంలో బీఎస్‌ఎన్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.35 లక్షల మొబైల్‌ టవర్లు ఉన్నాయని తెలిపిన మంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉందని.. ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికీ ఇక్కడ పట్టు సాధించలేదని తెలిపారు.

ఇదిలా ఉంటే 5జీ పరీక్షల్లో భాగంగా అవసరమైన వస్తువులను అందించాల్సిందిగా టీసీఎస్‌ కంపెనీని బీఎస్‌ఎన్‌ఎల్‌ కోరింది. దీంతో 5జీ ప్రయోగాత్మక సేవలను కంపెనీ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటు మద్ధతు ఇస్తోందని చెప్పిన కేంద్ర మంత్రి.. ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయన్నారు. రైల్వేలో ఇప్పటికే 800 స్టార్టప్‌లు, రక్షణ రంగంలో 200 స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో ఇలాంటి కొత్త ఆలోచనలు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..