మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??

మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??

Phani CH

|

Updated on: Dec 09, 2022 | 9:09 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ వస్తోంది. ఇటీవలే లేటెస్ట్ టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ Qualcomm 8 Gen 2 చిప్‌సెట్‌ను మోటో ప్రకటించింది మోటరోలా.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్ వస్తోంది. ఇటీవలే లేటెస్ట్ టాప్-నాచ్ స్నాప్‌డ్రాగన్ Qualcomm 8 Gen 2 చిప్‌సెట్‌ను మోటో ప్రకటించింది మోటరోలా. ఇప్పుడు ఈ చిప్‌తో రాబోయే నెలల్లో అనేక బ్రాండ్‌లు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది కంపెనీ. వీటి ఫీచర్లు ఇప్పటికే చాలా లీక్ అయ్యాయి. రాబోయే ఫోన్ మోటో ఎడ్జ్ 40 సిరీస్‌గా గ్లోబల్ మార్కెట్‌లలో ఆవిష్కరించే అవకాశం ఉంది. Moto X40, Moto X40 Pro రెండు ఫోన్‌లను మోటరోలా డిసెంబర్‌ నెలలో చైనాలో లాంచ్‌ చేయనుంది. లీక్‌ల ప్రకారం.. పంచ్-హోల్ డిజైన్‌తో కూడిన కర్వ్డ్ స్క్రీన్, ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని అనుకుంటున్నారు. మరోవైపు, OLED ప్యానెల్‌తో 1080p రిజల్యూషన్‌తో రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీ అందించనుంది. వెనుక కెమెరా సెటప్‌లో మోటో ఎడ్జ్ ప్లస్ మాదిరిగానే రెండు 50-MP మెయిన్, అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌లు ఉండవచ్చు. Moto X40, 18GB RAM ఇంకా 512 GB స్టోరేజ్ మోడళ్లు సరికొత్త ఆండ్రాయిడ్ 13 OSతో రన్ అవుతాయని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్‌.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!

Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత !! ఆ స్టార్‌ హీరో సినిమాలో..

Published on: Dec 09, 2022 09:08 AM