Year Ender 2022: ఈ ఏడాదిలో ప్రభుత్వ పథకాలపై కీలక మార్పులు.. అవేంటంటే..

దేశంలోని ప్రజల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, కుమార్తెల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. నేడు దేశంలోని కోట్లాది..

Year Ender 2022: ఈ ఏడాదిలో ప్రభుత్వ పథకాలపై కీలక మార్పులు.. అవేంటంటే..
Government Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Dec 09, 2022 | 2:01 PM

దేశంలోని ప్రజల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, కుమార్తెల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. నేడు దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వివిధ పథకాలలో అనేక పెద్ద మార్పులు చేస్తూనే ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఈ పథకాల ప్రయోజనాన్ని పొందినట్లయితే, మీరు ఈ మార్పుల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం 2022లో కూడా భారత ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. దేశంలోని ప్రజల కోసం అమలు చేస్తున్న రెండు అద్భుతమైన పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన నిబంధనలలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఈ పథకాలను కేంద్రం ఎలాంటి మార్పులు చేసిందో తెలుసుకోండి.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన:

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వార్షిక ప్రీమియం మొత్తాన్ని రూ.330 నుంచి రూ.436కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో జీవిత బీమా రక్షణను పొందేందుకు మీరు ప్రతి సంవత్సరం రూ.330కు బదులుగా రూ. 436 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నామమాత్రపు ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ అందిస్తోంది. అంటే ఏదైనా ప్రమాదశాత్తు పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు లభిస్తాయి. ఈ పాలసీ తీసుకుంటే బ్యాంకు అకౌంట్‌ తప్పకుండా ఉండాలి.

సుకన్య సమృద్ధి యోజన:

సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం. 2022 సంవత్సరంలో ప్రభుత్వం ఈ పథకంలో అనేక పెద్ద మార్పులు చేసింది. మీరు కొత్త నిబంధనల ప్రకారం మీ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయకుంటే ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. అంతకు ముందు సుకన్య సమృద్ధి యోజనలో ఇద్దరు కుమార్తెల ఖాతాలను తెరిచే అవకాశం ఉండేది. అలాగే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు అందుబాటులో ఉండేది. అయితే ఈ ప్రయోజనం మూడో కుమార్తెకు లభించలేదు. మరోవైపు కొత్త నిబంధనల ప్రకారం, మీ ఇంట్లో కుమార్తె పుట్టిన తర్వాత మీకు కవల కుమార్తెలు ఉంటే ఈ మీరు పథకంలో ఆ ఇద్దరు కుమార్తెల ఖాతాను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి