Cyclones: తుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? అవి ఎలా ఏర్పడతాయి..? ఎన్నో ఆసక్తికర విషయాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈ తుఫానుకు మాండూస్ అనే నామకరణం చేసిన వాతావరణ శాఖ అధికారులు.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం..

Cyclones: తుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? అవి ఎలా ఏర్పడతాయి..? ఎన్నో ఆసక్తికర విషయాలు
Cyclone
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2022 | 8:07 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈ తుఫానుకు మాండూస్ అనే నామకరణం చేసిన వాతావరణ శాఖ అధికారులు.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ మ ఆండూస్‌ తుఫాన్‌ తీరం దాటింది. మధ్య మహాబలిపురం సమీపంలో తీరందాటిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ తుఫాన్‌ ఎలా వస్తుందనే విషయం అందరికి ఆసక్తికరంగా ఉంటుంది. తుఫాన్‌లను ఎలా గుర్తిస్తారు..? ఎలా అంచనా వేస్తారనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది. మరి వాతావరణ నిపుణులు తుఫాన్‌ను ఎలాం తెలుసుకుంటారో చూద్దాం.

తుఫాన్లను ఎలా గుర్తిస్తారు?

వాతావరణ శాఖ అధికారులు వర్షాల గురించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాతావరణంలో జరుగుతున్న మార్పులను గమనిస్తుంటారు. కొన్ని సార్లు అధికారులు వాతావరణంలోకి బెలూన్లను వదులుతారు. ఆ బెలూన్‌లలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. వాటి ద్వారా అవి గాలి తీవ్రతను పసిగట్టి వాతావరణ కేంద్రంలోఉన్న కంప్యూటర్లకు సమాచారం చేరవేస్తాయి. అలాగే వాతావరణ కేంద్రాల్లో ట్రాపికల్‌ మీటర్లు ఉంటాయి. వాటి ద్వారా కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. డాప్లర్‌ రాడార్‌ సిస్టమ్‌ ద్వారా గాలిలోని తేమ శాతాన్ని గుర్తిస్తారు. ఇక తీవ్ర ప్రాంతాల్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఉంటాయి. అయితే వాటి పరిధిలోని ఎక్కడైనా ఒక్క మిల్లీ మీటర్‌ వర్షం పడినా వెంటనే రికార్డు చేసి వాతావరణ కేంద్రాలకు చేరవేస్తాయి. ఇది కాకుండా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటుంది. వర్షాలు, తుఫాన్లపై సమాచారాన్ని ప్రకటిస్తూ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తుంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ కేంద్రాలు కూడా ఎప్పటికప్పుడు వాతావరణంలో జరుగుతున్న మార్పులపై ప్రకటన విడుదల చేస్తుంటాయి. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో మరింత అప్రత్తంగా వ్యవహరిస్తుంటాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ముందస్తుగా ప్రత్యేక బులిటెన్‌ను విడుదల చేస్తుంటాయి.

తుఫాన్‌లను ప్రాంతాలవారీగా ఎలా పిలుస్తారు?

తుఫాన్‌లను ప్రాంతాల వారీగా పిలుస్తారు. దక్షిణ పసిఫిక్‌ సహాసముద్రం, హిందూ మహాసముద్రంలో ఏర్పడే అలజడులను సైక్లోన్‌ అంటారు. అలాగే ఉత్తర అట్లాంటిక్‌, మధ్య ఉత్తర పసిఫిక్‌, తూర్పు ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రాలలో ఏర్పడే తుఫాన్‌లను హరికేన్‌లుగా పిలుస్తారు వాతావరణ నిపుణులు. ఇక వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో పుట్టే తుఫాన్‌లను టైఫూన్లుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి

అధిక పీడనం అంటే ఏమిటి..?

ఎక్కడైతే గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దానిని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు కూడా గాల్లో కదలికల వల్లే ఏర్పడతాయని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. అయితే గాలుల్లో రెండు రకాల గాలులు ఉంటాయి. అవి వేడిగాలి, చల్లగాలి. వేడి గాలి తేలికగా ఉండి పైకి వెళ్తుంది. అదే చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది. భూ వాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడతాయి. దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. ఈ అల్పపీడనం మరింతగా తీవ్రమైనట్లయితే వాయుగుండంగా మారుతుంది. ఇది బలపడిన తర్వాత తుఫాన్‌గా మారుతుంది. సముద్రంలో వేడెక్కి నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాయి.

తీరాన్ని తాకడం అంటే ఏమిటి?

ఇక సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్‌.. భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్‌ తీరాన్ని తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సుడులకు కారణమైన గాలులు తీరంపైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగలవని చెబుతున్నారు.

తుఫాన్, హరీకేన్లకు తేడా ఏమిటీ?:

తుఫాన్లు ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఆగ్నేయాసియా ప్రాంతాల్లో సైక్లోన్ అని, ఈశాన్య పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లు అని పిలుస్తుంటారు. హరికేన్‌లు, టైపూన్‌ల మధ్య తేడాని గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు మించినట్లయితే అది హరికేన్‌ అని, గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైపూన్ అని పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో ఏర్పడుతుంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు వాతావరణ శాఖ నిపుణులు, వెబ్‌సైట్లు, ఇతర నిపుణుల ఆధారంగా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణుల ద్వారా తెలుసుకోండి.)

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..