Cyclone Names: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు.. వీటిని ఎవరు నిర్ణయిస్తారు..? నిబంధనలు ఏమిటి?

సాధారణంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా..

Cyclone Names: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు.. వీటిని ఎవరు నిర్ణయిస్తారు..? నిబంధనలు ఏమిటి?
Cyclones
Follow us
Subhash Goud

|

Updated on: Dec 07, 2022 | 3:23 PM

సాధారణంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. అయితే తుఫాన్లు వచ్చిన ప్రతి సారి వాటి పేర్లు కొత్తగా ఉంటాయి. తుఫాన్ల పేర్లు వింటేనే విచిత్రంగా ఉంంటాయి. అసలు ఈ తుఫాన్లుకు పేర్లు ఎవరు పెడతారు..? ఎలా పెడతారనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. ఇటీవల తుఫాన్లు దేశ వ్యాప్తంగా అనే రాష్ట్రాల్లో సంభవించి తీవ్ర నష్టం వాటిల్లింది.

తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) కూడా ఒకటి. ఈ కేంద్రలు 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్‌మెంట్‌ పని.

పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి..

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం వస్తోంది. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, మల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు.

ఇవి కూడా చదవండి

27వ సదస్సులో తుఫాన్ పేర్లపై ఒప్పందం

2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్‌, ఓమన్‌దేశాల్లో నిర్వంచారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. అయితే బంగాళాఖాతం, అరేబియన్‌ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్‌లోని ఆల్ఫబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను పొందుపర్చారు.

అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తుంటుంది. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలను కోరుతుంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరలేపింది.

కాగా, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా, మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా, నీలోఫర్‌ పాకిస్తాన్ పెట్టింది.

తుఫాన్ల పేర్లు పెట్టడంతో పాటించాల్సిన నిబంధనలు

  • ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు వీలు లేదు.
  • సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి.
  • తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఎక్కడ ఉండకూదు.
  • ఈ తుఫాన్ల పేర్లుపలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి.
  • ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.
  • పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.
  • సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు.
  • ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒక్కసారి మాత్రమే వాడాలి. మరోసారి వాడకూడదు.

దూసుకొస్తున్న ‘మాండస్‌ తుఫాను’

అయితే తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరంవైపు దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 1020 కి.మీ దూరంలో తూర్పు – ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ తుఫానుకు పేరు ‘మాండస్ తుఫాన్’గా నామకరణం చేశారు. ఈ తుఫాను 9న తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే