PIB Fact Check: మోదీ ప్రభుత్వం మహిళలకు రూ.2.20 లక్షలు ఇస్తోందా? ఇందులో నిజమెంత..? ఇదో క్లారిటీ

దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నారీ శక్తి యోజన కింద దేశంలోని మహిళలకు..

PIB Fact Check: మోదీ ప్రభుత్వం మహిళలకు రూ.2.20 లక్షలు ఇస్తోందా? ఇందులో నిజమెంత..? ఇదో క్లారిటీ
PIB Fact Check
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2022 | 7:56 PM

దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నారీ శక్తి యోజన కింద దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2.20 లక్షల రుణం ఇస్తోందని సందేశం సారాంశం. ఈ వైరల్‌ అవుతున్న సందేశాన్ని చూసి చాలా మంది నమ్ముతున్నారు. ఇది పూర్తిగా అబద్దమని ప్రభుత్వం చెబుతోంది. ఈ నకిలీ సందేశంలో మహిళలు ఆర్థిక సహాయం కోసం నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ వైరల్‌ అవుతున్న దానిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఎన్‌పీ) తనిఖీ చేసింది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ సందేశం నకిలీది:

ఈ వైరల్‌ అవుతున్న సందేశం పూర్తిగా నకిలీదని, ఎట్టి పరిస్థితుల్లో నిజమని అనుకోవద్దని పీఐబీ స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదని పీఐబీ తెలిపింది. ‘ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ రూ.2 లక్షల 20 వేలు ఇవ్వబోతోందని ‘ఇండియన్ జాబ్’ యూట్యూబ్ అనే ఛానెల్ పేర్కొంది. ఇది ఫేక్‌ న్యూస్‌ అని, కేంద్రప్రభుత్వం ఎలాంటి పథకం తీసుకురాలేదని తెలిపింది. వైరల్ సందేశంగా పంపబడుతున్న అటువంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దని పీఐబీ హెచ్చరించింది.

మీకు ఇలాంటి అనుమానాస్పద సందేశం వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలోక కనిపించే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని హెచ్చరిస్తోంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే https://factcheck.pib.gov.inలో మెసేజ్ చేయాలి. ప్రత్యామ్నాయంగా మీరు వాస్తవ తనిఖీ కోసం +918799711259కి WhatsApp సందేశాన్ని పంపవచ్చు. మీరు మీ సందేశాన్ని pibfactcheck@gmail.comకి కూడా పంపవచ్చు. వాస్తవ తనిఖీ సమాచారం https://pib.gov.inలో కూడా అందుబాటులో ఉంటుందని పీఐబీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే