Aadhaar Update: ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆధార్ అప్‌డేట్ ఫ్రీ.. యూఐడీఏఐ కీలక ప్రకటన
ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటనే విషయం అందరికి తెలిసిందే. ఆధార్ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి ఇతర చిన్నపాటి అవసరాలకు ఆధార్..
ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటనే విషయం అందరికి తెలిసిందే. ఆధార్ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి ఇతర చిన్నపాటి అవసరాలకు ఆధార్ ముఖ్యమైనదిగా మారిపోయింది. బ్యాంకు అకౌంట్ తీయడం నుంచి సిమ్ కార్డు తీసుకునే వరకు ఆధార్ తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్ విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) అనేక మార్పులు చేస్తుంటుంది. ఆధార్ కార్డును అప్‌డేడ్ చేసుకునేందుకు పోర్టల్‌లో అనేక మార్పులను తీసుకువచ్చింది. అయితే చాలా మంది ఆధార్ కార్డులో ఎన్నో తప్పులు దొర్లాయి. వాటిని సరి చేసుకునేందుకు కూడా యూఐడీఏఐ అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులో ఏవైనా అప్‌డేట్ చేయాలంటే ముందు మీ సేవ కేంద్రాలకు, ఇతర ఆన్‌లైన్ సేవ కేంద్రాలకు వెళ్తారు. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.
ఇందు కోసం మీ సేవ కేంద్రాలు వినియోగదారుల నుంచి కొంత రుసుము తీసుకుంటారు. అయితే గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఛార్జీలు కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి కేంద్రాలు. గతంలో ఈ ఛార్జీలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్ అప్‌డేట్ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ఆధార్ సంస్థ యూఐడీఏఐ ట్విట్ చేసింది.
అయితే ఈ ఉచిత సర్వీసు కేవలం బాల్‌ఆధార్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు మాత్రమే వర్తించనుంది. పిల్లల కోసం బాల్ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. దీనిని బ్లూ ఆధార్ కార్డ్ అని కూడా అంటారు. పిల్లల ఆధార్ కార్డు కోసం చాలా మంది మోసపూరితంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఇప్పుడు దీనిపై యూఐడీఏఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఎవరైనా ఆధార్ అప్‌డేట్ కోసం డబ్బులు అడిగినట్లయితే 1947 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, లేదా help@uidai.gov.in ఈమెయిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు యూఐడీఏఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఏ డాక్యుమెంట్లు అవసరం?
#BaalAadhaar#AadhaarEnrolment & #MandatoryBiometricUpdates are FREE OF COST UIDAI is strictly against any agency accepting extra money from residents for Aadhaar services. If you’re asked to pay extra, please call 1947 or email us at help@uidai.gov.in to register your complaint. pic.twitter.com/7QCOgMjbKT
— Aadhaar (@UIDAI) December 6, 2022
కాగా, యూఐడీఏఐ బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సూచనలు జారీ చేసింది. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు, ఆధార్ రికార్డులలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ ట్విట్టర్‌లో ప్రకటించింది. అంతేకాదు.. బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్లు మారవని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్ కార్డ్‌ను అప్లై చేయడానికి, పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి