LIC Amount: ఎల్‌ఐసీ స్కీమ్‌లో నిలిచిపోయిన అమౌంట్‌ను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలి..?

చాలా మంది ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం, రకరకాల పాలసీలు తీసుకోవడం అనేది చేస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎల్‌ఐసీలో డబ్బులు నిలిచిపోతాయి. అలాంటి సమయంలో కొన్ని..

LIC Amount: ఎల్‌ఐసీ స్కీమ్‌లో నిలిచిపోయిన అమౌంట్‌ను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలి..?
Lic Uunclaimed Amount
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2022 | 3:19 PM

చాలా మంది ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం, రకరకాల పాలసీలు తీసుకోవడం అనేది చేస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎల్‌ఐసీలో డబ్బులు నిలిచిపోతాయి. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎల్‌ఐసీ అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అయితే పాలసీ తీసుకున్న తర్వాత కొన్ని వాయిదాలు నిలిచిపోవడంతో డబ్బులు క్లెయిమ్‌ చేయడం నిలిచిపోతుంటాయి. అయితే నిలిచిపోయిన ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేరు. ఆ మొత్తం ఎంత, దానిని ఎలా పొందాలి తెలుసుకోండి.

క్లెయిమ్ చేయని మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఎల్‌ఐసీ తన వినియోగదారులకు సహాయం చేస్తుంది. దాని కోసం మీరు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో మీ నిలిచిపోయిన మొత్తం గురించి సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. కానీ దాని కోసం మీరు పాలసీకి సంబంధించిన సరైన వివరాలను సమర్పించాలి. దాని కోసం మీరు ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in కి వెళ్లాలి. అక్కడ మీరు పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆప్షన్‌ను ఎంచుకుని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ సమాచారాన్ని సమర్పించిన తర్వాత క్లెయిమ్, దాని మొత్తానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎల్‌ఐసీ కస్టమర్‌కు అందిస్తుంది. ఆ తర్వాత కింది దశలను పూర్తి చేసిన తర్వాత కస్టమర్ చెప్పిన మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండా మొత్తాన్ని విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. ఎల్‌ఐసీలో బకాయి మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మీరు ముందుగా ఎల్‌ఐసీ హోమ్‌పేజీని సందర్శించాలి. మీరు ఈ వెబ్‌సైట్ దిగువన అన్‌క్లెయిమ్ చేయని అమౌంట్ లింక్‌ను గుర్తించాలి. ఒక వేళ ఈ లింక్ అక్కడ అందుబాటులో లేకుంటే ఈ లింప్ పై క్లిక్ చేయండి. మీ వివరాలన్నింటినీ ఇక్కడ పూరించండి. ఈ సమాచారాన్ని లోపం లేకుండా సమర్పించిన తర్వాత, బకాయి మొత్తం గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా బకాయి మొత్తాన్ని కనుగొనడంలో మీకు ఇబ్బంది ఎదురైతే, మీరు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి సహాయం తీసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. కేవైసీ, పాలసీ వివరాలను అందించిన తర్వాత మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..