Diabetes tips: షుగర్ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగితే ఆందోళపడొద్దు.. ఈ హోం రెమెడీస్‌ పాటించండి.. కంట్రోల్‌లోకి వస్తుంది..

రక్తంలో చక్కెర స్థాయి 200 నుండి 300 mg/dL కంటే ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డయాబెటిస్ కు మందులే కాకుండా షుగర్ లెవెల్ నియంత్రణకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

Diabetes tips: షుగర్ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరిగితే ఆందోళపడొద్దు.. ఈ హోం రెమెడీస్‌ పాటించండి.. కంట్రోల్‌లోకి వస్తుంది..
Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 8:28 AM

బిజీ షెడ్యూల్, ఒత్తిడి, పేలవమైన జీవనశైలి కారణంగా అధిక బిపి, థైరాయిడ్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు ప్రజలను సులభంగా ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. షుగర్ లెవల్స్ ను సకాలంలో అదుపు చేయకపోతే చూపు కోల్పోవడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి 200 నుండి 300 mg/dL కంటే ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది డయాబెటిస్‌కు సూచన కావచ్చు. మందులే కాకుండా షుగర్ లెవెల్ నియంత్రణకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం,.. చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటే, దానిని నియంత్రించడానికి గరిష్టంగా నీరు త్రాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు గ్లూకోజ్‌ని బయటకు పంపవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి.

కాకరకాయ: షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ రసాన్ని తాగండి. లేదా పచ్చిగా తినండి.

ఇవి కూడా చదవండి

వ్యాయామం: ఏదైనా వ్యాధి ప్రభావాలను తగ్గించడంలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, ఫిట్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అకస్మాత్తుగా షుగర్ లెవెల్ పెరిగిన వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి