Winter skin care: స్నానం చేసే నీటిలో ఒక చెంచా నెయ్యి కలుపుకోండి.. పొందండి వెయ్యి లాభాలు..!!

గోరువెచ్చని స్నానం చేసే నీటిలో కేవలం ఒక చెంచా నెయ్యి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిబారడంతోపాటు అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Winter skin care: స్నానం చేసే నీటిలో ఒక చెంచా నెయ్యి కలుపుకోండి.. పొందండి వెయ్యి లాభాలు..!!
Warm Water With Ghee
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 7:44 AM

చలికాలంలో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. సీజన్ వేరియేషన్ వలన పలురకాల వ్యాధులు భాదిస్తుంటాయి. అయితే, చలి నుంచి ఉపశమనం పొందాలంటే.. నెయ్యిని వాడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యిని తరచుగా తీసుకునే వారిలో శరీరోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిబారడంతోపాటు అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చలికాలంలో వచ్చే అతి పెద్ద సమస్య చర్మంలోని తేమ పోతుంది. చర్మాన్ని తేమగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులు, ఇంటి పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. అందులో నెయ్యి ఒకటి. నెయ్యి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అనేక చర్మ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందువల్ల చల్లని వాతావరణంలో స్నానం చేయడానికి కూడా వేడి నీళ్లలో నెయ్యి కలుపుకోవాలని సూచిస్తున్నారు. గోరువెచ్చని స్నానం చేసే నీటిలో కేవలం ఒక చెంచా నెయ్యి కలుపుకోవాలి. దీంతో చర్మం తేమగా ఉంటుంది. మీరు అద్భుతమైన గ్లో పొందుతారు. నెయ్యి కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యి ప్రయోజనాలు..

1. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .. గోరువెచ్చని నీళ్లతో నెయ్యి కలిపి స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇలా చేయడం వల్ల చల్లటి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి అన్ని రకాల వ్యాధుల నుండి బయటపడతారు.

ఇవి కూడా చదవండి

2. చర్మానికి ఎండతగల కుండా చూసుకోండి.. చలికాలంలో చర్మం పొడిబారడం అనే సమస్య మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గోరువెచ్చని స్నానం చేసే నీటిలో నెయ్యి కలపండి. దీంతో చర్మం తేమగా ఉంటుంది. పొడిబారకుండా కూడా రక్షించబడుతుంది.

3. తలనొప్పి సమస్య నుండి బయటపడతారు.. మీరు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నట్టయితే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

4. దురద సమస్య నుండి ఉపశమనం గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపిన నీటితో తలస్నానం చేయడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడడమే కాకుండా, దురద సమస్య నుంచి కూడా చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, మీరు తాజాగా కనిపిస్తారు.

5. చర్మానికి లోపలి నుండి తేమ.. నెయ్యితో మీ చర్మం మృదువుగా, కోమలంగా మార్చుకోవచ్చు. మీ స్కాల్ప్ కూడా డ్రైగా ఉంటే నెయ్యిని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు, వెంట్రుకలకు మంచి పోషణ అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి