Heroin Seized: రెండు ట్రక్కుల్లో భారీగా డ్రగ్స్ సీజ్.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. విలువ తెలిస్తే కళ్లు బైర్లే..!
పక్కా సమాచారం ఆధారంగా రెండు ట్రక్కులను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రెండు ట్రక్కులను అడ్డగించామని చెప్పారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ట్రక్కు నుండి
ఈశాన్య రాష్ట్రం అసోంలో డ్రగ్స్, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు, పోలీసుల కళ్లు గప్పి కొందరు స్మగ్లర్లు అక్రమ దందా సాగిస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, యువత టార్గెట్‌గా దుంగడులు వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు అసోం పోలీసులు.. గురువారం రాత్రి కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వాహనాలను తనిఖీ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టుగా తెలిసింది.
పోలీసుల తనిఖీల్లో 30 వేల యాబా టాబ్లెట్‌లతోపాటు, రూ.7 కోట్ల విలువచేసే హెరాయిన్‌తో కూడిన 55 సోప్ కేసులు లభ్యమైనట్టుగా పోలీసులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ మొత్తాన్ని సీజ్ చేశారు. డ్రగ్స్‌ను తరలిస్తూ దొరికిపోయిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారం ఆధారంగా రెండు ట్రక్కులను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రెండు ట్రక్కులను అడ్డగించామని చెప్పారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ట్రక్కు నుండి 30,000 యాబా టాబ్లెట్‌లు, మణిపూర్ నంబర్ ప్లేట్ ఉన్న మరో ట్రక్కు నుండి 55 సబ్బు కేసులలో ప్యాక్ చేసిన 757.15 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్యాబ్లెట్‌లు, హెరాయిన్‌ల విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి