AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.. దేశం నలువైపులా బీఆర్ఎస్ వెలుగులు.. కేసీఆర్..

దేశ రాజకీయాల్లోకి రావాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. నేడు కార్యరూపం దాల్చింది. దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌...

BRS: ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.. దేశం నలువైపులా బీఆర్ఎస్ వెలుగులు.. కేసీఆర్..
Cm Kcr Brs
Ganesh Mudavath
|

Updated on: Dec 09, 2022 | 4:20 PM

Share

దేశ రాజకీయాల్లోకి రావాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. నేడు కార్యరూపం దాల్చింది. దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో తొలుత కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సుముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 60 శాతం సాగు భూములు ఒక్క భారత దేశంలో ఉన్నాయని, నదీ జలాలపై ఇప్పటికీ రాష్ట్రాల మధ్య యుద్దాలే జరుగుతున్నాయని మండిపడ్డారు. బకెట్ నీళ్ల కోసం కన్నీళ్లుఅ పెట్టాల్సి వస్తోందని, అన్ని వసతులు ఉండీ ఏమి చేయలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

40 వేల టీఎంసీ ల మిగులు జలాల నీళ్ళు వృథాగా పోతున్నాయి. అనేక భూ పోరాటాలు నీళ్ళ కోసమే జరిగాయి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. పరివర్తన కోసమే 14 న ఢిల్లీ లో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభిస్తాం. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికాను మించిపోతుంది. సహజ వనరుల వాడకంలో దేశ నాయకులు విఫలమయ్యారు. గుణాత్మక భారతదేశం కోసం పోరాడదాం. దేశంలో కొత్త నీటి విధానం రావాలి. తప్పుడు ఆర్థిక విధానాలతో దేశం కుదేలవుతోంది. దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరం చాలా ఉంది. నీరు, అపార ఖనిజ, అపార బొగ్గు సంపద ఉన్న ఈ దేశంలో కరెంటు కోతలు ఉండటం సిగ్గుచేటు. కొత్త ఆర్థిక విధానాలతో పాటు కొత్త వ్యవసాయ విధానం సరికొత్త పారిశ్రామిక విధానం అవసరం. మహిళా సాధికారికపై దేశంలో చచ్చి జరగాలి. కొత్త విధానాలు రావాలి.

– కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

అణగారిన, అల్పసంఖ్యాక వర్గాల కోసం ప్రత్యేక పథకాలు రూపకల్పన జరగాలన్న కేసీఆర్.. మౌలిక వసతులు సదుపాయాలపై దృష్టిసారిస్తామన్నారు. రిటైర్డ్ జడ్జీలు, ఐఏఎస్ ఐపీఎస్ లతో దేశ విధానాలపై మేథో మథనం జరుగుతోందన్నారు. ఫెడరల్ స్ఫూర్తి కాపాడే చట్టాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు తనను అనేక మంది అవహేళన చేశారని.. ఇప్పుడు దేశం కోసం వెళ్తున్నప్పుడు మళ్లీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయినా పిడికిలి బిగించి ఢిల్లీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి వెలుగు దివ్వె ను దేశం నలు దిశల వ్యాపింపజేద్దామని పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..