Cyclone Mandous: ప్రజలకు అలెర్ట్.. తుఫాన్ సమయంలో చేయాల్సినవి.. చేయకూడనవి

శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఈ తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

Cyclone Mandous: ప్రజలకు అలెర్ట్.. తుఫాన్ సమయంలో చేయాల్సినవి.. చేయకూడనవి
Cyclone Awareness
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2022 | 1:28 PM

మాండూస్ ముప్పు ముంచుకొస్తోంది. వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మాండూస్‌..12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి తమిళనాడు-మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశముంది. తిరుమపై మాండూస్‌ ఎఫెక్ట్ పడింది. దీని ప్రభావంతో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రెండు ఘాట్‌రోడ్లు, శ్రీవారిమెట్టు, అలిపిరి మార్గాలపై ఫోకస్‌ పెట్టింది టీటీడీ. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. క్రేన్లు సహా ఇతర ఎక్విప్‌మెంట్‌ను సిద్ధంగా ఉంచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో చిత్తూరు గంగినేని చెరువును పరిశీలించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్. మరోవైపు ఈదురు గాలులతో చలి తీవ్రత పెరిగింది. సరిహద్దులోని మండలాలను అప్రమత్తం చేశారు.

తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్‌ ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్‌. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఒంగోలు చేరుకున్నాయి NDRF, APSDRF బృందాలు. ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్ దినేష్ కుమార్.

తుఫాను ముందు, తుఫాను సమయంలో, తుఫాన్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవడంతో విపత్తు సంభవించినప్పుడు నష్టాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

తుఫాన్ ముందు….

  • పుకార్లను నమ్మవద్దు. ప్రశాంతంగా ఉండండి. భయపడవద్దు.
  • అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి. వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనిస్తూ ఉండండి.
  • మీ పత్రాలు సర్టిఫికెట్స్, విలువైన వస్తువులను వాటర్ ప్లస్ కంటైన్సర్ తో ఉంచండి.
  • మీ ఇంటిని, ముఖ్యంగా పైకప్పును మరమ్మతులు ఉంటే చేపట్టండి.

తుఫాన్ సమయంలో, తరువాత…

  • మీ ఇల్లు సురక్షితం కాకపోతే తుఫాను ప్రారంభం కాకుముందే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోండి.
  • తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
  • తుఫాన్ మ్యాప్ తెలుసుకోండి. అధికారిక సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్ళవద్దు.
  • ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆన్ చేయండి. అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్లను తీసివేయండి
  • కరెంట్ పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండండి
  • చెట్ల కింద అస్సలు ఉండవద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..