Varahi Row: పవన్ ‘వారాహి’పై వైసీపీ నేతల సెటైర్లు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్..

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథమైన ‘వారాహి’ వాహనంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి.. హైకోర్టుతో మొట్టికాయలు..

Varahi Row: పవన్ ‘వారాహి’పై వైసీపీ నేతల సెటైర్లు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్..
Nadendla Manohar
Follow us

|

Updated on: Dec 09, 2022 | 12:10 PM

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథమైన ‘వారాహి’ వాహనంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి.. హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఐటీ విభాగం ప్రతినిధులతో జనసేన పీఏసీ‌ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘వారాహి’ వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందన్నారు. నిబంధనలు పరిశీలించకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం.. వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోందన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయని విమర్శించారు నాదెండ్ల. జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుందని, పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుందని స్పష్టం చేశారాయన. వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. అలాంటి వారికి పవన్ కల్యాణ్ ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారని, అది నిజాయితీకి ఉన్న దమ్ము అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైస్సార్సీపీ ఆర్టీసీగా మారిపోయిందని విమర్శించారు నాదెండ్ల. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలు పట్టించుకోని వారికి.. నిబంధనల గురించి చెప్పే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వైసిపి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రకటన ఇప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు నాదెండ్ల.

ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలు చిత్తశుద్ధి లేనివన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌. అప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. వైసీపీ నేతలు రెండు రాష్ట్రాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు నాదెండ్ల మనోహర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..