Viral Video: కోడి కోసం చిన్నోడి ఐడియా అదుర్స్…. తనతో తీసుకెళ్లేందుకు ఏం చేశాడో చూస్తే షాకవుతారు..

చిన్న పిల్లలు పెంపుడు జంతువులు, పక్షులతో కలిసి ఆడుకునే ఆటలు మరింత మనోహరంగా ఉంటాయి. మూగజీవాల పట్ల వారు చూపించే ప్రేమ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఇంటర్నెట్‌లో తాజాగా అలాంటిదే ఒక వీడియోలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Viral Video: కోడి కోసం చిన్నోడి ఐడియా అదుర్స్.... తనతో తీసుకెళ్లేందుకు ఏం చేశాడో చూస్తే షాకవుతారు..
Little Boy Takes Chicken
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2022 | 12:32 PM

పిల్లలు అమాయకత్వానికి ప్రతిరూపం. అలాంటి చిన్నారులు చేసే అల్లరి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో పసిపిల్లల ఆటపాటలకు సంబంధించిన అనేక వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. చిన్న పిల్లలు పెంపుడు జంతువులు, పక్షులతో కలిసి ఆడుకునే ఆటలు మరింత మనోహరంగా ఉంటాయి. మూగజీవాల పట్ల వారు చూపించే ప్రేమ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఇంటర్నెట్‌లో తాజాగా అలాంటిదే ఒక వీడియోలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియోలో ఒక పిల్లవాడు తన సైకిల్‌కు కట్టిన బొమ్మ ట్రక్‌పై కోడిని జాయ్‌రైడ్‌కి తీసుకెళ్తూ కనిపించాడు. ప్రస్తుతం వీడియోని చాలా మంది నెటిజన్లు లైక్‌ చేస్తున్నారు.

బ్యూటెంగేబిడెన్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పిల్లవాడు ఒక కోళ్ల ఫారమ్ దగ్గర కోడిని తీసుకొని తన సైకిల్‌కు జోడించిన బొమ్మ ట్రక్కులో పెట్టాడు. ఆ తర్వాత మెల్లగా సైకిల్‌ని తీసి పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. వీడియోలో పిల్లవాడితో పాటు ఓ బాతు కూడా నడుస్తూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

అందమైన ఈ వీడియోని ట్విట్టర్‌లో 2.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. వినియోగదారులు చిన్నారి చేసిన పనికి ప్రశంసలతో ముంచెత్తారు. చిన్నవాడైన ఎంత గొప్ప పనిచేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి